TSPSC రద్దు చేయాలి...
గ్రూప్ వన్ రాసిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి
బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాంబాబు
సి కె న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాథిరాం నాయక్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు వైరా నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాంబాబు ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా రాంబాబు నాయక్ మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్ష రద్దు నిమిత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గనిరాహార దీక్ష చేయడం వల్ల గ్రూప్ వన్ పరీక్ష రద్దయిందని అయినా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించిందని గౌరవ హైకోర్టు వారు ఈ యొక్క పరీక్ష రద్దు చేశారని
గ్రూప్ వన్ రాసిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని టిఎస్పిఎస్సి బోర్డు మొత్తాన్ని రద్దు చేయాలని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఉమెన్ కన్వీనర్ బానోతు రజిని వైరా నియోజకవర్గ కార్యదర్శి కంచిపు నరసింహారావు ఏన్కూరు మండల అధ్యక్షుడు వెంగళ నరేష్ కొనిజర్ల మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రవీణ్ శరత్ శ్రీనాథ్ పాల్గొన్నారు
Comments
Post a Comment