అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

 అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి


సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాతిరాం నాయక్

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లకు కనీస వేతన 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జూలూరుపాడు సాయిబాబా టెంపుల్ వద్ద ఆవరణంలో అంగన్వాడీలు  నిరవధిక సమ్మె చేయడం జరిగింది

 ఆ  సందర్భంగా సీతామహాలక్ష్మి లలిత మనీ జయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని అదేవిధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 చెల్లించాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటి చెల్లించాలని పని భారం తగ్గించాలని సుదీర్ఘకాలంగా అంగన్వాడీలు పోరాటం నిర్వహిస్తున్న ప్రభుత్వం తాతకాలికంగా కొద్ది మేర వేతనాలు పెంచి రిటర్మెంట్ బెనిఫిట్స్ తూతూ మంత్రంగా చెల్లించడం అంగన్వాడీలను మోసం చేయడమేనని వారు విమర్శించారు..

 అదేవిధంగా టీచర్లకు 10 లక్షలు ఇవ్వాలని ఐదు లక్షలు హెల్పర్లకు పెన్షన్ ఇవ్వాలని ఎలాంటి షరతులు  లేకుండా మినీ సెంటర్ ను మెయిన్ సెంటర్ గా గుర్తించాలని ఇతర డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలని గతంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆమె అన్నారు.

 తక్కువ వేతనం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల పనులు చేస్తూ అంగన్వాడీలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె అన్నారు. మరొకవైపు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లలో  మూసివేసే దానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె అన్నారు.

 గతంలో యూపీఏ ప్రభుత్వం 100 శాతం నిధులు కేటాయిస్తే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 శాతం నిధులను కేటాయిస్తూ మొత్తం అంగన్వాడి వ్యవస్థను విచ్చిన్నం  చేసిందని ఆమె అన్నారు

 ఇప్పటికైనా తెలంగాణకేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 2017 నుండి కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వంవెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు .

 సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా సీతామహాలక్ష్మి లలిత మణి జయ ఆదిలక్ష్మి సక్కుబాయి లీల జయ ఝాన్సీ నాగమణి విజయ విద్యా బేబీ సుమిత్ర సునీత తదితరులు పాల్గొన్నారు.

Comments