ఇద్దరు కల్తీ పాల తయారీదారులు అరెస్టు

 *భువనగిరి జిల్లాలో.. కల్తీ పాల తయారీదారులు ఇద్దరు అరెస్టు*

భువనగిరి జిల్లా:సెప్టెంబర్ 20

కల్తీపాలు తయారు చేస్తున్న గృహాలపై  పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక ఎస్‌ఐ విక్రంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భీమనపల్లి గ్రామానికి చెందిన కప్పల రవి కల్తీపాలను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రవి ఇంటిని తనిఖీ చేశారు.


ఈ మేరకు అతని వద్ద 350* లీటర్ల కల్తీ పాలు, 100 మిల్లీమీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ , 2 డోలోఫర్ సిమ్డ్ మిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కనుముకుల గ్రామంలో కుంభం రవి ఇంటి వద్ద వంద లీటర్ల కల్తీ పాలు, 200 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ సిమ్డ్ మిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.


వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పాలను పరీక్షల నిమిత్తం ల్యాబరేటరీకి పంపించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు...

Comments