ఆశా వర్కర్లకు ఫిక్సుడు వేతనం 18000 వేలు ఇవ్వాల్సిందే...!

*ఆశా వర్కర్లకు ఫిక్సుడు వేతనం 18000 వేలు ఇవ్వాల్సిందే...!*

సీ కే న్యూస్ ప్రతినిధి/కొల్లాపూర్ : 

*ఈశ్వర్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు*



 కొల్లాపూర్ మండల కేంద్రంలోని శనివారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా 13 వ రోజుకు చేరుకుంది ఆ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది ఆశ వర్కర్లు గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు 

చేస్తున్న పనికి ఎలాంటి విలువ లేకుండా పోతుందని కాబట్టి ఆశ వర్కర్లకు ఫిక్స్ డు వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని లేదంటే ధర్నాను ఉద్రిక్తం  చేస్తున్నామని , ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేసి సమ్మెను విరమించాలని ఆయన అన్నారు.

 కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశ వర్కర్లకు సరైన గుర్తింపు లేదని ఆయన అన్నారు డబ్ల్యూహెచ్ఓ  ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ గుర్తించకపోవడం ఆశ వర్కర్ల యొక్క శ్రమను గుర్తించలేదని ఆయన అన్నారు 

పేరుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతనాలు ఇస్తున్నామని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13000 ఫిక్స్ డు రుపాయల వేతనం ఇస్తుంటే మరి తెలంగాణ ధనిక రాష్ట్రం 9750 ఇచ్చి గొప్పలు  చెప్పుకుంటుందని ఆయన అన్నారు. 

దేశ అత్యున్నత  న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2018 సెప్టెంబర్ 18వ తేదీన తీర్పునిస్తే తెలంగాణ ధనిక రాష్ట్రం న్యాయవ్యవస్థ తీర్పును కూడా అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల  కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను గుర్తించకపోవడం అందులో భాగంగా ప్రభుత్వ అధికారులతో సమానంగా పనిచేస్తున్న వేతనాల విషయంలో తేడా ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్లకు ఫిక్స్ డు వేతనం 18 వేల రూపాయలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25 నుంచి నిరవధిక సమస్య చేపడతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు కళావతి,వర్కర్ల జిల్లా నాయకురాలు శ్రీదేవి, శివ లీల, చెన్నమ్మ, గౌరమ్మ, ఒకలా దేవి, గీత, దీప అరుణ, రేణుక మహాలక్ష్మి.తదితరులు పాల్గొన్నారు

Comments