ఇందిరాపార్క్ లో కల్లుగీతా కార్మికల మహా ధర్నా....
ఇందిరాపార్క్ లో కల్లుగీతా కార్మిక సంఘము ఆధ్వర్యంలో పలు సమస్యల పరిష్కారానికై మహా ధర్నా....
- మద్దతు ప్రకటించిన సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్...
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) సెప్టెంబర్ 23
రాష్ట కమిటీ రాష్ట ప్రభుత్వం గత ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు పలు డిమాండ్ల సాధనకై కల్లు గీతాకార్మిక సంఘము ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాపార్క్ లో తెలంగాణ రాష్ట్రములోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వేలాది మంది గీతావృత్తి దారులతో రాష్ట అద్యక్షులు మేకపోతుల వెంకటరమణ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
త్వరగా సేఫ్టీ మోకులు అందించి ప్రమాదాలు జరకుండా చూడాలని అలాగే సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు అందించాలని తాడి కార్పొరేషన్ నుండి వచ్చే ప్రమాదం ఖర్చులు 15 వేలకు బదులు 30వేలు దహన సంస్కారాలకు 25 వేలు కు 50 వేలు అందించాలని నిరకేఫ్ ను ప్రతి జిల్లా మండల కెoద్రాల్లో ఏర్పాటు చేయాలని
లిక్కర్ షాపులను గ్రామ గీతా కార్మిక సొసైటీ లకే ఇవ్వాలని విగ్రహం త్వరగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని గీతా కార్మికుల ఫించన్ 5000వేలకు పెంచాలని 560 జి.ఓ ప్రకారం గ్రామ సొసైటీలకు చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద 10 లక్షల గౌడ్ బంధు ప్రకటించాలని ప్రమాదం జరిగిన
వెంటనే చనిపోతే గీతన్న బీమా కాకుండా ఇప్పుడు ఇస్తున్న 5లక్షలకు బదులు 10 లక్షలు ప్రకటించి నెల రోజుల్లో వచ్చే ఏర్పాటు చేయాలని శాశ్వత వికాలా oగులకు 6 లక్షలు మాములుగా దెబ్బలు తగిలిన వారికి 3 లక్షలు వచ్చే విదంగా చూడాలని జిల్లా మెడికల్ బోర్డ్ వారు సదరం సట్ఫికెట్ ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని
మెడికల్ బోర్డ్ నిబంధన సవరించాలని గ్రామాలలో కల్లు మండువల్లో కల్లు అమ్ముకోవటానికి లిక్కర్ బార్లను తలదన్నే విదంగా తాడి బార్లు ఏర్పాటు చేసి గీత వృత్తి దారులను ఆదుకోవాలని ఏజెన్సీ గౌడులకు గీతా కార్మికులుగా గుర్తించి సొసైటీలుగా ఏర్పాటు చేసి ఐ.డి కార్డులు అందించాలని 18 డిమాండ్లతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు ప్లే కార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
అనంతరం ధర్నాను ఉద్దేశించి సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ మాట్లాడుతు 18 డిమాండల్లో కొన్నిప్రభుత్వం ఎలక్షన్జ్ ముందు హామీలిచ్చి మరిచి పోయిందని ప్రభుత్వo కల్లు తెరిపించటానికే ఈ ధర్నాకు గీత కార్మికులు వాటర్ బాటిల్ సద్ది మూటతో స్వంత వాహనాలు సమకూర్చుకొని స్వచ్చందంగా తరలివచ్చారని రాబోయే రోజుల్లో ఇదే తెగిoపుతో ముందుకు కదలాలని వీరస్వామిగౌడ్ అన్నారు.
ఇన్ని విధాలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంలోని పెద్దలకు చీమకుట్టినట్టు కూడా లేదని గత 75 ఏళ్లుగా పాలించిన ఈ పాలక పార్టీలైన బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు గౌడుల చట్టసభల్లో అడుగు పెట్టకుండా బీసీ కులాలను నయవంచనకు గురిచేస్తున్నాయని అందుకే సర్వాయిపాపన్న వారసులుగా
ఒకఓటు ఓకనోటు!బీసీల ఓట్లు బీసీలకే వేసుకుందాం!బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకుందాం అనే నినాదంతో రిజర్వేషన్ సీట్లు పోను అన్ని నియోజకవర్గాల్లో గౌడ సోదరులు పెద్దన్న పాత్ర పోషిస్తు బీసీలను కలుపుకొని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడి చట్టసభల్లో అడుగుపెట్టి
మన సత్తా చాటి ఈ ఉన్నతవర్గ పార్టీలను బొద్దపెట్టటానికి మనఓటు మన వాడికి వేసుకొని చట్ట సభలకు పంపాలని వీరస్వామిగౌడ్ అన్నారు.అందుకే నేను హుజురాబాద్ నియోజకవర్గంలో నిలబడుతున్నానని 2 లక్షల 32 వేల ఓట్లు ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీలవి బహుజనులవి లక్షా 90వేల వరకు ఉన్నాయని వీరస్వామిగౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఐలి వెంకన్నగౌడ్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడసంఘము రాష్ట ప్రధాన కార్యదర్శి పల్సo సోమన్న గౌడ్ రాష్ట కోశాధికారి రేగటి నాగరాజు గౌడ్ సహా సోదర గౌడ సంఘాల నాయకులు
మోర్ల ఏడుకొండలు గౌడ్ వంగ రాములు గౌడ్ వంగ సదానందంగౌడ్ కల్లు గీతా కార్మిక సంఘము రాష్ట జిల్లా నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లుగౌడ్ బాలగోని జయరాములుగౌడ్ కొయ్యడ కొమురయ్యగౌడ్ బూడిద గోపిగౌడ్ బండకింది అరుణ్ గౌడ్ గుండెబోయిని రవిగౌడ్ గౌని సాంబయ్య గౌడ్ గౌని వెంకన్న గౌడ్ వేలాది మంది గీతా కార్మికులు పాల్గొని ఈ ధర్నాను వియవంతం చేశారు.
Comments
Post a Comment