*వాజేడు లో ఇద్దరు కొరియర్ల అరెస్ట్*
*పోలీసులను చంపాలనే లక్ష్యం తో పేలుడు పదార్థలు రవాణా*
*పక్క సమాచారం తో అదుపులోకి తీసుకున్న పోలీసులు*
*సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి :షేక్ రహీమ్**
ములుగు జిల్లా వాజేడు మండలం లో ఇద్దరూ నక్సల్స్ కొరియర్లు అరెస్టు అయ్యారు
వివరాల్లోకి వెళితే సిపిఐ మావోయిస్టు పార్టీ 19వ వారోత్సవాల సందర్భంగా కూబీంకి వెళ్లే పోలీస్ పార్టీలను చంపాలని లక్ష్యంతో మావోయిస్టు సానుభూతిపరులు పేలుడు పదార్థాలతో ఎటునాగారం నుండి వెంకటాపురం వెళుతుండగా పక్క సమాచారం అందుకున్న
వెంకటాపురం సిఐ కుమార్, వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు తో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనగా ఒక స్త్రీ, ఒక పురుషుడు అనుమానస్పదంగా కనిపించడంతో వారి యొక్క సామాన్లను తనిఖీ చేయగా అందులో ప్రెషర్ బాంబు తయారీకి ఉపయోగించే పేలుడు సామాగ్రిని లభ్యం అయ్యాయి.
వెంటనే వారిని అదుపులోకి విచారించగ వారిలో స్త్రీ పేరు కలువల ఐలమ్మ అలియాస్ మీనా తండ్రి పేరు రాజమల్లు వయస్సు 47సంవత్సరాలు, కులం మాదిగ, వృత్తి ల్యాబ్ టెక్నీషియన్ మంచిర్యాల జిల్లా,
ఆలూరి దేవేందర్ రెడ్డి తండ్రి పేరు మధుసూదన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామం.
వీరు ప్రభుత్వ నిషేధిత సి పి ఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులకు గత కొంతకలంగా కొరియర్స్ గా పనిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశానుసరం మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్బంగా కూబింగ్ కి వెళ్లే పోలీస్ పార్టీలను చంపాలనే ఉద్దేశం తో పేలుడు సామాగ్రి తీసుకెళ్తున్నట్టు తెలిపారు.
సీఐ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ వారికి సహకరించవద్దని వారితోపాటు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని నక్సల్స్ వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నేరాలకు పాల్పడుతూ అమాయక గిరిజనులను ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని యువత జీవితాలను నాశనం చేస్తున్నారు
వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నేర కార్యకలాపాలకు పాల్పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కావున యువత వారికి దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Post a Comment