తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులు విడుదల

తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులు విడుదల

హైదరాబాద్:సెప్టెంబర్ 21

తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులను కెసిఆర్ సర్కార్  అందించనుంది, రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లు నిధులను ఈ మేరకు విడుదల చేసింది.



తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి నిధులను విడుదల చేసింది. ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. రైతు రుణమాఫీ ద్వారా దాదాపు 21.35 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. తొలి విడతగా రూ.50 వేలలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేయగా..



*రెండో విడత రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 3 నుంచి  ప్రభుత్వం ప్రారంభించింది*


రెండో విడతలో 29.61 లక్షల మంది రైతులకు రూ.19 వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్ట్ 5న రూ.5809 కోట్లు, తాజాగా రూ.10 వేల కోట్ల విడుదల చేసింది.


త్వరలో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ చేయనుంది. ఎన్నికల నేపథ్యంలో విలైనంత త్వరగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బ్యాంకులతో సంప్రదించి వేగవంతంగా చర్యలు చేపడుతోంది. 


రుణమాఫీ నిధులు విడుదల అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రైతు రుణమాఫీ ఎప్పుడు అవుతుందా? అని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు......

Comments