*కబ్జాకు గురవుతున్న గిరిజనుల భూమి స్పందించని అధికారులు*
మానుకోట జిల్లా కేంద్రంలోని పత్తిపాక శివారు మంగళ్ కాలనీలో సర్వేనెంబర్ 437 లో పూర్వీకుల నుండి బోడ వెంకన్న అనే గిరిజన కుటుంబం అతని పేరా పట్టా రిజిస్ట్రేషన్ అన్ని సర్వహక్కులు కలిగి ఉండి పూర్వీకుల నుండి ఉన్నటువంటి భూమిని, అతను బతుకుదెరువు కోసం మంగళ కాలనీ నుండి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటే, అది అదునుగా చేసుకొని కొంతమంది కబ్జాదారులు జెసిబిలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి, అట్టి భూమిని చదును చేస్తా ఉన్నారు.ఏమిటని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తున్నారు. దీనిని సేవాలాల్ సేన నేడు పరిశీలించి తీవ్రంగా ఖండించడం జరిగింది. సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ, కబ్జాకు గురైనటువంటి భూమిని వెంటనే ఇట్టి పనులను ఆపాలి.
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ సేన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కబ్జా చేసినటువంటి వారు మేము మంత్రి సత్యవతి రాథోడ్ అనుచరులమని చెప్పుకుంటూ దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. వెంటనే మంత్రి గారు దీనిపై స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు వెంటనే స్పందించి గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలి, లేని,పక్షంలో సేవాలాల్ సేన గా మేము అండగా ఉండి ఇట్టి విషయాన్ని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి దృష్టికి ,మరియు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తామని , సర్వహక్కులు ఉన్నటువంటి గిరిజన కుటుంబానికి చెందిన భూమిని పట్టపగలే యదేచ్ఛగా కబ్జా చేస్తుంటే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ గారిని స్పందించకపోవడం హాస్యాస్పదం వెంటనే స్పందించి ఇట్టి పనులను ఆపకపోతే బోడ వెంకన్న గిరిజన కుటుంబంతో సహా ఎంతటి ఉద్యమానికైనా సేవాలాల్ సేన పూనుకుంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ రాంబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి మాలోత్ సురేష్ నాయక్,బానోత్ గణేష్ నాయక్, మానుకోట పట్టణ అధ్యక్షులు బోడ దిలీప్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment