ఆసక్తికరంగా సెకండ్‌ లిస్ట్‌.. ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే!

ఆసక్తికరంగా సెకండ్‌ లిస్ట్‌.. భారం దించుకోనున్న స్క్రీనింగ్‌ కమిటీ! ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని హస్తినలో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది.

ఏఐసీసీ కార్యాలయంలో రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి భేటీ కాగా.. ఆ తర్వాతి బంతి హైకమాండ్‌ కోర్టుకు చేరుతుంది. దీంతో.. టీ కాంగ్‌ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితా ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ తొలుత ఈనెల ఆరో తేదీన హైదరాబాదులో సమావేశమైంది. వరుసగా పీఈసీ సభ్యులను, డీసీసీ అధ్యక్షులను, మాజీ మంత్రుల అభిప్రాయాలు తీసుకుంది. అయితే సమయం సరిపోక మరోసారి భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు హస్తినలో భేటీ అయింది.


స్క్రీనింగ్ కమిటీలో ఛైర్మన్ మురళీధరన్ ,జిగ్నేష్ మేవాని, సిద్దిఖీ ,ఎక్స్ అఫిషియో సభ్యులు ఇంఛార్జి ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు.

ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టాలని భావిస్తోంది.ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేయాలని లక్ష్యం తో ముందుకు వెళ్తుంది. దాదాపు.. 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మొదటి దశలో ఉండే నియోజకవర్గాలు..(అంచనా)
1. కొడంగల్ - రేవంత్ రెడ్డి,
2. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి,
3.కోదాడ - పద్మావతి ,
4. మధిర - భట్టి విక్రమార్క ,
5. మంథని - శ్రీధర్ బాబు ,
6. జగిత్యాల - జీవన్ రెడ్డి ,
7. ములుగు - సీతక్క ,
8. భద్రాచలం - పొడెం వీరయ్య,
9. సంగారెడ్డి - జగ్గారెడ్డి ,
10. నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
11. అలంపూర్ - సంపత్ కుమార్,
12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి ,
13. కామారెడ్డి - షబ్బీర్ అలీ ,
14. పాలేరు - తుమ్మల నాగేశ్వరరావు ,
15. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
16. పరిగి - రామ్మోహన్ రెడ్డి,
17. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్,
18. మహేశ్వరం - చిగురింత పారిజాత,
19. ఆలేరు - బీర్ల ఐలయ్య,
20. ఖైరతాబాద్ - రోహిన్ రెడ్డి,
21. దేవరకొండ - వడ్త్య రమేష్ నాయక్,
22. వేముల వాడ - ఆది శ్రీనివాస్,
23. ధర్మపురి - లక్ష్మణ్ ,
24. జడ్చర్ల - అనిరుద్ రెడ్డి,
25. హుజూరాబాద్ - బల్మూర్ వెంకట్ ,
26. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్,
27. కోరుట్ల- జువ్వాడి నర్సింగ్ రావు,
28.అచ్చంపేట - వంశీకృష్ణ,
29 జహీరాబాద్ - ఏ. చంద్రశేఖర్ ,
30. ఆందోల్ - దామోదర రాజనర్సింహ,
31.మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు,
32. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు ,
33. ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి,
34. వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ,
35. భూపాల పల్లి - గండ్ర సత్యనారాయణ

హైకమాండ్‌ను ఓ నివేదిక ఇచ్చేయాలని..
కాంగ్రెస్‌ అధిష్టానానికి నివేదిక ఇచ్చే ఉద్దేశంతో ఉన్న స్క్రీనింగ్‌ కమిటీ.. కంటిన్యూగా మీటింగ్‌ నిర్వహిస్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉన్న నియోజకవర్గాలపై ఈ భేటీల్లో ఫోకస్ చేసినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. డిస్టబెన్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పేర్లతో కూడిన నివేదిక ను సిద్ధం చేయనుంది. దాదాపు 70 సెగ్మెంట్ లలో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంతో.. నివేదికను హైకమాండ్‌కు అందించి భారం దింపేసుకోవాలనే ఆలోచనతో ఉంది స్క్రీనింగ్ కమిటీ.

కాంగ్రెస్ లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలు..
1.వనపర్తి - చిన్నారెడ్డి/మెఘారెడ్డి/ శివసేన రెడ్డి
2. అంబర్ పేట - నూతి శ్రీకాంత్ గౌడ్ / మోతా రోహిత్ / లక్ష్మణ్ యాదవ్,
3.మహబూబాబాద్ - బలరాం నాయక్/ మరళీ నాయక్ /బెల్లయ్య నాయక్ ,
4.జనగామ - పొన్నాల లక్ష్మయ్య/ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి/ మొగుళ్ళ రాజిరెడ్డి
5.షాద్ నగర్ - ఈర్లపల్లి శంకర్/ ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్,
6 . వైరా - డి. రాoమూర్తి /బానోతు విజయ్ భాయి,

7. నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్ గౌడ్ / ఎర్రావత్రి అనిల్,

8.వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్‌ రెడ్డి/ జంగా రాఘవ రెడ్డి,

9.స్టేషన్ ఘన్ పూర్ - ఇందిరా/ దొమ్మటీ సాంబయ్య ,

10.మునుగోడు - పున్న కైలాష్ నేత/పాల్వాయి స్రవంతి,

11.ఎల్బీ నగర్ - మధుయాష్కీ/ మల్ రెడ్డి రాంరెడ్డి,

12.కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి/ రాఘవేందర్ రెడ్డి,

13.ఆశ్వరావు పేట్ - తాటి వెంకటేశ్వర్లు/సున్నం నాగమణి,

14.ఎల్లారెడ్డి - సుభాష్ రెడ్డి/ మధన్ మోహన్ రావు,

15.జూబ్లీహిల్స్ - విష్ణు వర్దన్ రెడ్డి/ అజారుద్దీన్,

16. సూర్యాపేట - దామోదర్ రెడ్డి/ పటేల్ రమేష్ రెడ్డి,

17. మిర్యాలగూడ - రఘువీర్ రెడ్డి/ బి. లక్ష్మారెడ్డి,

18. దేవరకద్ర - ప్రదీప్ గౌడ్ / జీఎంఆర్ ,

19. మక్తల్ - శ్రీహరి / నాగరాజు గౌడ్ /కొత్తకోట సిద్ధార్థ రెడ్డి,

20. గద్వాల - సరితా తిరుపతయ్య / రాజీవ్ రెడ్డి,

21. నాగర్ కర్నూల్ - కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి / నాగం జనార్ధన్ రెడ్డి,

22. మేడ్చల్ - తోటకూర జంగయ్య యాదవ్ / హరివర్ధన్ రెడ్డి,

23. ఉప్పల్ - రాగిడి లక్ష్మారెడ్డి / సోమశేఖర్ రెడ్డి / పరమేశ్వర రెడ్డి ,

24. కుద్బుల్లాపూర్ - భూపతిరెడ్డి నర్సారెడ్డి / కొలను హన్మంతు రెడ్డి,

25. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్ / సంగిశెట్టి జగదీశ్వర్ రావు,

26. మలక్ పేట్ - చెక్లోకర్ శ్రీనివాస్ / అశ్వక్ ,

27. గోషామహల్ - మెట్టు సాయికుమార్ / ప్రేమ్ లాల్ /ఆనంద్ రావు ,

28. సనత్ నగర్ - కోటా నీలిమ / మర్రి ఆదిత్య రెడ్డి ,

29. శేర్లింగంపల్లి - జర్పెటీ జైపాల్ / రఘునాథ్ యాదవ్/సత్యనారాయణ రావు ,

30. తుంగతుర్తి - అద్దంకి దయాకర్ / జ్ఞానసుందర్ / ప్రీతం ,

31. డోర్నకల్ - రామచంద్ర నాయక్ / నెహ్రూ నాయక్,

32. నారాయణ్ ఖేడ్ - సురేష్ శట్కర్ / సంజీవరెడ్డి,

33. కూకట్ పల్లి - శ్రీరంగం సత్యం / వెంగల్ రావు,

34. ముదోల్ - ఆనంద్ రావు షండే/పత్తిరెడ్డి విజయ్ కుమార్ ,

35. సత్తుపల్లి - సంబాని చంద్రశేఖర్ / మానవతా రాయ్ / మట్టా దయనంద్

36. బోద్ - శివాలాల్ రాథోడ్ / నరేష్‌ జాదవ్‌ ,

37. బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్ / దుర్గం భాస్కర్,

38. ఇల్లందు - కోరం కనకయ్య / ప్రవీణ్ నాయక్,

39.చొప్పదండి - మేడిపల్లి సత్యం/జిల్లెల భానుప్రియ,

40. నారాయణ్ పేట్ - ఎర్ర శేఖర్ /శివకుమార్ రెడ్డి,

41. ఆసీఫాబాద్‌ - విశ్వప్రసాద్‌ / గణేష్ రాథోడ్,

42. రామగుండం - రాజ్ ఠాకూర్ / హర్కల వేణుగోపాల్ రావు /జనక్ ప్రసాద్,

43. నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్‌ / రాజి రెడ్డి,

44. గజ్వేల్ - నర్సారెడ్డి / బండారు శ్రీకాంత్ రావు ,

45. నిర్మల్ - శ్రీహరి రావు / పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ,

46. భువనగిరి - జిట్టా బాలకృష్ణ రెడ్డి/చెవిటి వెంకన్న యాదవ్,

47. పెద్దపల్లి - విజయ రమణా రావు / గంటా రాములు యాదవ్/ఈర్ల కొమురయ్య,

48. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి / మేకల వీరన్న యాదవ్,

49. పాలకుర్తి - ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి/ఝాన్సీ రెడ్డి,

50. మహబూబ్ నగర్ - యెన్నం శ్రీనివాసరెడ్డి/ఒబెదుల్లా కొత్వాల్/ఎంపి.వెంకటేష్,

51. ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి /దండెం రాంరెడ్డి,

52. కరీంనగర్ - రోహిత్ రావు / కొత్త జైపాల్ రెడ్డి/రమ్యా రావు / కొనగాల మహేష్ ,

53. సిద్దిపేట - భవానీ రెడ్డి / పూజల హరికృష్ణ /శ్రీనివాస్ గౌడ్ ,

54. ఖానాపూర్ - బొజ్జు/ భారత్ చౌహాన్ / చారులతా రాథోడ్,

55. ఆర్మూర్ - గోర్త రాజేందర్ / వినయ్ కుమార్ రెడ్డి ,

56. బాల్కొండ - సునీల్ రెడ్డి / బాణాల మోహన్ రెడ్డి / అన్వేష్ రెడ్డి,

57. రాజేంద్రనగర్ - గౌరీ సతీష్ /ముంగి జైపాల్ రెడ్డి /నరేందర్ ముదిరాజ్,

58. హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్/ ప్రవీణ్ రెడ్డి,

59. తాండూర్ - రఘువీర్ రెడ్డి/కేఎల్ఆర్,

60. చెన్నూర్ - డాక్టర్ శ్రీనివాస్/నల్లాల ఓదెలు/బోడ జనార్థన్,

61.నిజామాబాద్ రూరల్ - అరికెల నర్సారెడ్డి / భూపతి రెడ్డి ,

62. పినపాక - బట్టా విజయ్ గాంధీ / పాయం వెంకటేశ్వర్లు,

63. వర్ధన్నపేట - సిరిసిల్ల రాజయ్య / కేఆర్.నాగరాజు/పరంజ్యోతి,

64. జుక్కల్ - గంగారాం/గైక్వాడ్ విద్య/అయ్యాల సంతోష్,

65. బాస్నువాడ - కాసుల బాలరాజు/అనిల్ కుమార్ రెడ్డి,

66. సిరిసిల్ల - కేకే.మహేందర్ రెడ్డి/సంగీతం శ్రీనివాస్,

67. దుబ్బాక - కత్తి కార్తీక/చెరుకు శ్రీనివాస్ రెడ్డి,

68. మల్కాజ్ గిరి - నందికంటి శ్రీధర్/అన్నే వెంకట సత్యనారాయణ/సురేష్ యాదవ్,

69. చేవెళ్ల - షాబాద్ దర్శన్/భీమ్ భారత్/రాచమల్ల సిద్దేశ్వర్/సులోచనమ్మ,

70. కంటోన్మెంట్ - పిడమర్తి/ బొల్లు కిషన్

అభ్యర్థుల ఎంపిక పై టీ పీసీసీ స్థాయిలో ఇదే చివరి భేటీ.. ఇక అభ్యర్థులను ప్రకటించే పూర్తి బాధ్యత హైకమాండే. దీంతో కీలక నేతలంతా తమకు అనుకూలంగా ఉండేవాళ్లకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెలాఖరులో మొదటి లిస్ట్ ,వచ్చే నెల రెండో వారంలో రెండో లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని హస్తం శ్రేణులు భావిస్తున్నాయి.

Comments