ములుగు DMHO సహాయం మరువలేనిది
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అనారోగ్య పరిస్థితిలో ఉన్న మహిళను,
ఒక్క ఫోన్ కాల్ ద్వారా ప్రాణాలు కాపాడిన, అధికారి
డెంగ్యూ జ్వరంతో ప్రాణాపాయ స్థితిలో వైద్యం అందించిన DMHO
"ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్"
ములుగు జిల్లా మంగపేట మండలంలో డెంగ్యూ జ్వరంతో ఒక మహిళ ఏటూరునాగారం లోని ప్రైవేటు ఆసుపత్రిలో తన అనారోగ్య నిమిత్తం వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని బాధితురాలి జోబు కాళీ అయ్యాక ఏటూరునాగారం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు,
మహిళ అనారోగ్య పరిస్థితిని గమనించిన ఏటూరునాగారం వైద్య సిబ్బంది ఆ బాధితురాలికి రెండు రోజులు వైద్యం అందించాక, డెంగ్యూ జ్వరంతో రక్త కణాలు రోజు రోజుకి తగ్గుముఖం పట్టడంతో, మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు రిఫర్ చేశారు,
ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్న; డబ్బులన్నీ ఖాళీ అవ్వడంతో, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను కనీసం ప్రైవేట్ వాహనం మాట్లాడుకుని జిల్లా దవఖానాకు కూడా, తీసుకువెళ్లలేని ఆర్థిక స్థితిలో ఉన్న బాధితులు, ఆర్టీసీ బస్సును ఆశ్రయించారు,
బస్సులో ములుగు ప్రభుత్వ దవఖాన కు చేరుకున్న బాధితులు, డెంగ్యూ జ్వరంతో ప్రాణాల కోసం పోరాడుతున్న, బాధితురాలి రిపోర్ట్స్ చూసిన ములుగు వైద్య సిబ్బంది, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎం.జీ.ఎం కి రిఫర్ చేశారు,
ఏం చేయాలో దిక్కుతోచని బాధితురాలి కుటుంబ సభ్యులు లబో దిబోమని మొత్తుకుంటూ, పక్కవారి సలహా మేరకు ములుగు జిల్లా ఆరోగ్య శాఖ ఉన్నత అధికారి DMHO కి కాల్ చేశారు,
ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న DMHO అప్పయ్య, హాస్పిటల్ కి వచ్చి, బాధ్యురాలి అనారోగ్య స్థితిని పూర్తిగా గమనించిన DMHO వెంటనే వైద్యం అందించాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు,
అనంతరం వెంటనే సరైన వైద్యం అందడం వల్లనే ప్రాణాలతో బయటపడ్డానని బాధితురాలు, DMHO చొరవ వలనే బ్రతికాను అంటూ కృతజ్ఞతలు తెలిపారు..
Comments
Post a Comment