750 కోట్ల రూపాయల నగదు సీజ్!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పక్క మద్యం ఏరులై పారుతుంటే, మరోపక్క ఓటర్లకు పంచిపెట్టేందుకు నగదును ట్రక్కుల రూపంలో తరలిస్తున్నారు నాయకులు.
పోలీసులకు వాటిని తనిఖీ చేయడం, సీజ్ చేయడమే పనిగా మారుతోంది. దీంతో రహదారి వెంట ఏ వాహనం వెళ్లినా దాని వంక అనుమానంగానే చూస్తున్నారు పోలీసులు.
ఈ నేపథ్యంలో గద్వాల్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అటుగా వెళుతున్న ఓ ట్రక్కును అడ్డగించారు.
750 కోట్ల రూపాయల నగదును ట్రక్కుతో తరలించడం చూసి పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ట్రక్కును అడ్డగించారు పోలీసులు.
సాధారణంగా స్మగ్లర్లకు అనుకూలంగా ఉండే మార్గం ఇది. దాంతో పోలీసులు ట్రక్కును చూసి అప్రమత్తమయ్యారు. కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది.
ట్రక్కు, అందులో ఉన్న పెద్దమొత్తంలో ఉన్న నగదు గురించి ఆరా తీసిన పోలీసులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన నగదు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేరళ నుండి హైదరాబాద్‌కు తరలించబడుతున్నట్లు తెలుసుకున్నారు.
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ అన్ని ఊహాగానాలకు ముగింపు పలికారు. బ్యాంక్ అధికారుల నుండి నగదు ధృవీకరణ అందుకున్న తర్వాత ట్రక్కును విడుదల చేసినట్లు తెలిపారు.
"రూ. 750 కోట్ల నగదు ఉన్న ట్రక్ కొన్ని గంటలపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పటిష్టంగా తనిఖీ చేస్తున్నాయని సీఈవో తెలిపారు.
ఢిల్లీలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ , గోవా మరియు ఇతర ప్రాంతాల నుండి మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదుల మేరకు ఐపీఎస్ అధికారులు, నలుగురు కలెక్టర్లు, సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
EC కఠినంగా మాట్లాడటంతో, రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు దేన్నీ తేలిగ్గా తీసుకోవడం లేదు. వెళ్లే ప్రతి వాహనంపై అనుమానంతోనే ఉంటున్నారు. అదేవిధంగా మంగళవారం రాత్రి ట్రక్కును హైవేపై నిలిపివేశారు. EC కోసం తెలంగాణ పోలీసు నోడల్ అధికారి సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, "నగదుతో కూడిన ట్రక్కు రోడ్డు బ్లాక్‌ను ఎదుర్కొంది.
సహాయం కోసం గద్వాల్ పోలీసులకు కాల్ చేయడంతో మా సిబ్బంది తనిఖీలో భారీ మొత్తాన్ని కనుగొన్నారు. నగదు పత్రాలు పరిశీలించిన తర్వాతల యూనియన్ బ్యాంక్ , మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి ట్రక్కును విడుదల చేశారు. గద్వాల్ పోలీసులతో కలిసి ట్రక్కు హైదరాబాద్‌కు ప్రయాణాన్ని కొనసాగించింది."
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, విలువైన రాళ్లు కలిపి రూ.165 కోట్లకు చేరాయి. స్వాధీనం చేసుకున్న బంగారం, వజ్రాలు, విలువైన లోహాల విలువ రూ.62 కోట్లు, నగదు రూ.77 కోట్లు.
Comments
Post a Comment