*డబ్బు ,మద్యం పంచకుండా ఓట్లు అడిగే దమ్ము మాకుందీ... మరి మీకు ఉందా* ??
*డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు*
సికే news కల్లూరు
స్థానిక కల్లూరు పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ అధికార బి ఆర్ ఎస్ పార్టీ డబ్బు మద్యం పంచకుండా వాళ్ళు చెప్పుకుంటున్న
అభివృద్ధిని మాత్రమే చూపిస్తూ ఓట్లు అడగగలిగే సత్తా వాళ్ళకు ఉందా అని సవాల్ విసిరారు. ఈ 15 సంవత్సరాలుగా కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమిలేదని చివరకు ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళ అనుచరులకు ఇచ్చుకోవడం తప్ప సామాన్యులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.
దళిత ముఖ్యమంత్రి ఎటు పాయా,దళితులకు మూడెకరాల పొలం ఏమైపోయా,15 నెలల డీడీలు తీసినా రాని యాదవ సోదరులకు గొర్రెలటుపాయే, ఇప్పుడు మళ్లీ దళిత బంధు పేరుతో అందరికీ ఇస్తామని చెప్పి హడావుడిగా జీవో తెప్పించి మళ్లీ దళితులను మోసం చేయడానికి మరో కుట్ర కు తెర తీసి ఎన్నికల్లో వాళ్ళ ఓట్లతో పబ్బం కడుక్కోవాలని చూస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు..
కార్యక్రమంలో జాతీయ బిసి సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ గారు,మండల నాయకులు మాదిరాజు అన్నం రాజు, నారపరెడ్డి, కత్తి కృష్ణారెడ్డి ,కుర్ర నరసింహారావు ,రాజు బోయిన శీను, దేవరపల్లి వెంకటేశ్వర్లు, కుక్క యాలాద్రి భాగం ప్రభాకర్ చౌదరి,మూకర విజయరావు ,పాప బత్తిని, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య శివ, నగేష్ ,జాతీయ బిసి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు యువజన విభాగం ఉపాధ్యక్షుడు పరిమి భరత్,
రామ్ నరసింహారావు,కల్లూరు మండల నాయకులు ఏనుగు సత్యంబాబు,ఉస్మాన్,తురబ్ అలీ,చెన్నూరు కె.వి , మచ్చ వెంకటేశ్వరరావు ,ఎనుముల రాము, బత్తుల రాము , పంతులు నాయక్ దామాల సురేష్ , నోటి కృష్ణారెడ్డి, వర్ధ బోయిన పుల్లారావు , కొండపల్లి మురళి, గద్దె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..
Comments
Post a Comment