బూర్గంపాడులో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ
బెల్ట్ షాపులు నిర్వహిస్తే పీడీ యాక్ట్ లక్ష రూపాయల ఫైన్ అంటూ వార్నింగ్
సీకే న్యూస్ బూర్గంపాడు అక్టోబర్ 29
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలంలో ముందుగా బెల్టుషాపులపై కొరడా ఝుళిపించాలి అని నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి బెల్టుషాపులు నిర్వహిస్తే
బెల్ట్ తీస్తామని సంకేతాలను ఇచ్చిన ఎక్సైజ్ శాఖ ఒక సమావేశం నిర్వహించి హెచ్చరించింది బూర్గంపాడు మండలంలో బెల్టు షాపులు మరియు గుడుంబా నియంత్రణకు నడుంబిగించింది ఎక్సైజ్ శాఖ, బెల్ట్ షాపులు తీస్తే బెల్టు తీస్తాం అంటున్న
ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపుల నిర్వాహకులకు వార్నింగ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ముందు బెల్ట్ షాపులు లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకుంది
బూర్గంపాడు ఎక్సైజ్ శాఖ అందులో భాగంగా బెల్టు షాపుల నిర్వాహకులను పిలిచి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు బెల్టుషాపులు నిర్వహించటం వల్ల ఎలక్షన్ టైం లో అనవసరమైన ఇబ్బందులు పడతారని,
ఎలక్షన్ కమిషనర్ బెల్టు షాపుల నిర్వహణ పై చాలా సీరియస్ గా ఉందని వారికి అవగాహన కల్పిస్తోంది. ఒకవేళ ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే పిడి యాక్టు పెట్టి, లక్ష రూపాయలు ఫైన్ వేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించింది.
Comments
Post a Comment