*బిఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి ?*
హైదరాబాద్:అక్టోబర్ 26
బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ ప్రగతి భవన్‌లో గురువారం రోజు కనిపించడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికే ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారిన తరుణంలోనే బిత్తిరి సత్తి ప్రగతి భవన్‌లో ఉండడం చర్చకు దారి తీసింది. మంత్రి కేటీఆర్‌తో ఆయన భేటీ అయినట్లు సమాచారం.
అయితే దేని కోసం భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం.. ఆ కమ్యూనిటీ నుండి ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గమంతా బీఆర్ఎస్‌పై గుర్రుగా ఉన్నారు.
అయితే రాజకీయాలపై బిత్తిరి సత్తి ఆసక్తి చూపుతుండడంతో ఆయనను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి పెద్దపీట వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ప్రతి నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు ఉండడం.. గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉండడంతో ముదిరాజ్ వర్గానికి చెందిన వారిని చేరదీసే ప్రయత్నంలో భాగంగానే బిత్తిరి సత్తిని ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నట్లు సమాచారం.
అయితే గతంలో బిత్తిరిసత్తితో ఒక పాట కూడా పాడించుకున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో ఆయనతో పాట పాడించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంతకు పార్టీలో చేరిక పైన... లేకపోతే పాట కోసం పిలిపించారనేది సస్పెన్స్ గా మారింది..
Comments
Post a Comment