ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం

*ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం*

*నాన్ తండాలో ట్రాక్టర్ బోల్తా సంఘటన బాధాకరం*

*- ఘటనకు బీఆర్ఎస్ పార్టీనే నైతిక బాధ్యత వహించాలి*

*-  చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 50లక్షలు*

*- గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలి*

*-  తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్*

సికె న్యూస్ ప్రతినిధి



*ఖమ్మం :* కూసుమంచి మండలం నాన్ తండాలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ సంఘటనకు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 50లక్షలు, గాయపడిన వారికి రూ. 10లక్షల చొప్పున పార్టీ తరుపున ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments