సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిరుపేదలకు ఉచిత శిక్షణ

 *సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిరుపేదలకు ఉచిత శిక్షణ*

 *శిక్షణ పొందిన 16 మందికి పోలీస్ ఉద్యోగాలు*

*గతంలో అగ్నివీర్ 12 మందికీ ఉద్యోగాలు*

*కోచ్ నక్క నరేందర్ సేవలకు షాద్నగర్ పోలీస్ అధికారులు ప్రశంసనీయం*


దేశ రక్షణకు శాంతిభద్రత పరిరక్షణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ  సామజిక సేవలలో ముందుకు వెళ్తున్న సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు నక్క నరేందర్.

షాద్ నగర్ నియోజకవర్గంలో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పోలీసు శిక్షణ అందిస్తూ ఉద్యోగాలు కల్పించడంలో యువతకు స్ఫూర్తి దాయకంగ,నిలుస్తున్నారు.

వెలువడిన ఫలితాలలో 16 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో శాలువా, పూలమాలలతో ఘన సత్కారం చేశారు. 

ఉచిత శిక్షణలు ప్రారంభించి ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని  నిర్వాహకుడు నక్క నరేందర్ ను పోలీసు అధికారులు అభినందించారు.క్రమ శిక్షణతో     ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జాబ్ పొందిన వారికి సూచించాడు.

 గత నెలలో కూడా వెలువడిన అగ్ని వీర్ ఫలితాలలో 12 మంది ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు పొందారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలో  సైనిక్ డిఫెన్స్ అకాడమీ నాణ్యమైన విద్యా బోధనలు కటోర సాధన  శిక్షణతో నిరుద్యోగుల జీవితాలలో వెలుగు నింపుతున్నారు.

Comments