గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి కఠిన కారగార శిక్ష

గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి కఠిన కారగార శిక్ష.

సెషన్స్ జడ్జ్ (స్పెషల్ జడ్జ్ ఎన్ డి పి ఎస్ యాక్ట్ ) ఎం. శ్యాం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),


అక్టోబర్ 30,



గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జ్ (స్పెషల్ జడ్జ్ ఎన్ డి పి ఎస్ యాక్ట్ ) సోమవారము ఎం. శ్యాం తీర్పు చెప్పారు.  భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ జి.రాంబాబు తమ సిబ్బందితో 24-02-2019 న భద్రాచలo,

 కూనవరం రోడ్డు వద్ద వాహన చెకింగ్ చేస్తుoడగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన గన్నవరం డిపో బస్సు నేo. ఏ.పి. జెడ్ -16- 0559 కుంట నుండి విజయవాడ వెళ్ళే బస్సులో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి కి చెందిన 1) మడకం దేవా 2) కౌవాసి సోనా 3) గణేష్ మండల్ 4) తమిళనాడు కు చెందిన తానే ,

అలినగరం రంజిత్ లు, ఒరిస్సా రాష్ట్రంలో  గుర్తు తెలియని వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు హైదరాబాదు, విజయవాడలో అమ్ముకొని అధిక  లాభాలు పంచుకున్నామని 63,400 (అరవై ముడు కేజీల నాల్గు వందలు) గంజాయి ప్యాకెట్లు విలువ రు.7,60,800/- దొరుకగా వారు నేరము ఓప్పు కున్నారని,

 పంచనామా ద్వారా ఆట్టి గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసి అప్పటి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసుకున్నాడు , అప్పటి  సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.వినోద్ దర్యాప్తు అనంతరం కోర్టులో  చార్జిషీటు దాఖలు చేశారు. 

కేసు విచారణలో తమిళనాడుకు చెందిన రంజిత్ చనిపోయాడు.కోర్టులో ఏడుగురు  సాక్షులను విచారించారు. దేవా కౌవాసి సోనా గణేష్ మండల్ ల పై నేరo రుజువు కాగా, ముగ్గురికి ఒక్కొక్కరికి 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు వారందరికీ చేరి ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

.అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావి విజయకుమార్  ప్రాసిక్యూషన్ నిర్వహించారు.లైజాన్ ఆఫీసర్ ఎం. హరి గోపాల్,  కోర్టు డ్యూటీ ఆఫీసర్ భద్రాచలం టౌన్ ఏఎస్ఐ గంజి శశిధర్ లు సహకరించారు.

Comments