*పాలేరు నియోజకవర్గంలో నా పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు*
*- అభిమానులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన*
*- నాన్ తండాలో జరిగిన ఘటనకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిర్ణయం*
*ఖమ్మం :* పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం నాన్ తండాలో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా నియోజక వర్గ వ్యాప్తంగా వేడుకలు జరపాలని ఆయన అభిమానులు నిర్ణయించిన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
దుర్ఘటన జరిగి బాధిత కుటుంబాలు ఆవేదనలో ఉంటే పుట్టిన రోజు వేడుకలను జరపడం భావ్యం కాదన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండే కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అభిమానులను కోరారు.
Comments
Post a Comment