ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. ఆ పార్టీ కీలక నేత రాజీనామా

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. ఆ పార్టీ కీలక నేత రాజీనామా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party )కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు.

నేడు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు చేరుకున్నారు. 


వీరి సమక్ష్యంలో వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.సీఎం కేసీఆర్‌ని కలవడానికి పలుమార్లు అపాయింట్‌మెంట్ అడిగిన పట్టించుకోకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. 

దీనికితోడు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కూడా సీఎం కేసీఆర్ తనకు మెండిచేయి చూపించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

 పార్టీ టికెట్ ఇస్తుందని ఆశలు పెట్టుకున్న తనను పట్టించుకోకపోవడంతో తన అనుచరులతో సమావేశం అయి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తనను సంప్రదించడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అయితేనే కరెక్ట్ అని హస్తం పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

జలగం సొంత గూటికి చేరుకుంటుడంపై ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలగం కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ బలం మరింత పెరగనున్నది.

 కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ పెండిగ్‌లో ఉండడంతో జలగం వెంకట్రావుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ముమ్మర ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Comments