వైరా సీటు మనదే....!

 *వైరా సీటు మనదే....!*

*- పొత్తుల్లో పోతుందనడంలో నిజం లేదు*

*- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని  అఖండ మెజారిటీతో గెలిపించాలి*

*- సిరిపురంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి*

సికే న్యూస్ ప్రతినిధి



*వైరా :* పొత్తుల్లో వైరా సీటు పోతుందనడంలో నిజం లేదు...  కొంతమంది కావాలనే అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఆ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరుపున వైరా బరిలో ఉండే మన అభ్యర్థిని ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. వైరా నియోజక వర్గంలోని సిరిపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే... బీజేపీ,  బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి.  తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ను కాదని ప్రజలు రెండు సార్లు కేసీఆర్ కి అధికారం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశాడు. 

ఐదు లక్షల కోట్లు అప్పు చేసి అందులో లక్ష కోట్లు అప్పనంగా నొక్కేసాడు. ప్రజల బాగు కోరుకుంటున్నానని మభ్యపు మాటలు చెప్పి మోసం చేశాడు. మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.

కర్ణాటక లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగింది.

తెలంగాణలో సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను కూడా హస్తం పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చి చూపుతామని హామీ ఇస్తున్నా. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందుకు మీ అందరూ ఓటు వేసి దీవించాలి.

రాహుల్ గాంధీ బస్ యాత్రలో ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అనే తపన ప్రజల్లో గమనించాం. వైరా రిజర్వాయర్ సమస్యకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపిస్తాం.

డిసెంబర్ 9న ప్రజల అశీస్సులు దీవెనలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో వైరా నియోజక వర్గ నాయకురాలు  బానోతు విజయబాయి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ  వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మచ్చా వెంకటేశ్వరరావు, మట్టూరి నాగేశ్వర రావు  తదితరులు ఉన్నారు.

Comments