కేటీఆర్ కు ఈసీ నోటీసులు?

*కేటీఆర్ కు ఈసీ నోటీసులు?*


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నేతలు, ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది.


తాజాగా..మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రగతి భవన్ వేదికగా.. 

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌ కంప్లైంట్స్ అందాయి.

దీంతో రిటర్నింగ్‌ అధికారిని, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను పంపించి విచారణ జరిపినట్లు రొనాల్డ్ రాస్ వెల్లడించారు. కోడ్ ఉల్లంఘనలపై మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ మంగళవారం నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

పూర్తి విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పిందని ఎన్నికల అధికారి గుర్తుచేశారు..

Comments