కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ గ్రామాల ప్రజలు

 *బయ్యారం మండలంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ గ్రామాల ప్రజలు*


సికె న్యూస్ బయ్యారం మండల ప్రతినిధి జవాజి ప్రవీణ్ కుమార్


బయ్యారం   మండలం వెంకట్రాంపురం, చర్లపల్లి, ఇరుసులపురం, రామచంద్రపురం, మోట్ల తిమ్మాపురం, అల్లిగూడెం, గ్రామపంచాయితీలలో  ఇల్లందు నియోజకవర్గ బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ నాయక్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న 


మహబూబాబాద్ జిల్లా చైర్ పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, బయ్యారం మండల ఎంపీపీ కుమారి చేపూరి మౌనిక, మండల అధ్యక్షులు తాత గణేష్

*ఎన్నికల ప్రచార సభల్లో హరిప్రియ నాయక్ గారు మాట్లాడుతూ.*


దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి....కాంగ్రెస్, బిజెపి లు జాతీయ పార్టీలు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ఈ పథకాలను అమలు చేయకుండా ఇక్కడ మాత్రం ఇస్తామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు అని అన్నారు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయించాను నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌళిక వసతులు మెరుగుపరిచాను, ప్రజలకు  అవసరమైన సామాజిక వసతులు కల్పించాను.

గ్రామాలలో గల్లిగల్లికి సిసి రోడ్లు వేయించాను. మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందిస్తున్నాం..

కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నది కావున ప్రజలు కాంగ్రెస్ చెప్పే మాయ మాటలు నమ్మకండి కాంగ్రెస్ వాళ్లను నమ్మొద్దు  ఎన్నికల అప్పుడు వస్తుంటారు పోతుంటారు ..

ఆరు గ్యారంటీలు అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో పథకాలు అమలు చేయాలి అంతే కానీ ప్రజలకు కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాల హామీలిచ్చి ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత కుట్రలు చేస్తుంది అని అన్నారు.

గత అయిదేళ్ళలో ప్రజలు అడిగిన  పనులన్నీ చేశాను. ఇప్పుడు మీరు అందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించాలి అన్నారు...ప్రజలంతా మూకుమ్మడిగా కారు గుర్తుకు ఓటు వేసి బారి మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు...

అనంతరం కిస్టపురం,కాచనపెల్లి,కొత్తగూడెం గ్రామ పంచాయితీ లనుండి కాచనపెళ్ళిలో బయ్యారం మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత గణేష్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ నుండి 300 కుటుంబాలు ఇల్లందు నియోజకవర్గ బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ నాయక్ సమక్షంలో చేరారు..

వారికి ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ నాయక్ బీ ఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ నాయక్ వెంట

 సొసైటీ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బానోత్ మురళీకృష్ణ,బానోతు లక్ష్మణ్, ఏనుగుల ఐలయ్య, బానోతు  శ్రీను, రేపకుల వెంకన్న, గుండ్రెడ్డి సోమిరెడ్డి,చెరుకుపల్లి రవి,సర్పంచులు ,ఎంపీటీసీలు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు...

Comments