తిరుమలకు పాదయాత్ర

 తిరుమలకు పాదయాత్ర


పలమనేర్ నియోజకవర్గం గంగవరం మండలం గుండుగల్లు నవంబర్ 5 సీకే న్యూస్

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన. వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి.

వెంకటేశ్వరుని మించిన దైవము, తిరుమలను మించిన పవిత్ర పుణ్యక్షేత్రం ఈ భూమండలంలో మరొకటి లేదని అర్థం.

వివరాలు ఇలా ఉన్నాయి.గంగవరం మండలం గుండుగల్లు గ్రామస్తులు గుండుగలు సర్పంచ్  ఎంవి రమణ


 ఆధ్వర్యంలో, ఈరోజు, తిరుమలకు 200 మంది పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు..

గోవింద నామస్మరణలతో, పండరి భజనలతో, కోలాటాలతో, అత్యంత భక్తి పారవశ్యంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు.

   ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.... ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తిరుమలకు పాదయాత్రగా వెళ్తామని, ఈ సంవత్సరం కూడా పాదయాత్రగా వెళుతున్నామని, 

ఆ దేవదేవుడు వర్షాలు చక్కగా కురిపించాలని పంటలు బాగా పండేటట్టు ఆశీర్వదించాలని, ఆ దేవదేవుని కోరుకున్నట్టు, ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియజేశారు..

Comments