కెసిఆర్ తో పోటీకి ఎవ్వరొచ్చినా గంప కింద పెట్టుడే

*కెసిఆర్ తో పోటీకి ఎవ్వరొచ్చినా గంప కింద పెట్టుడే: మంత్రి కేటీఆర్* 

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు వచ్చిన మెజార్టీ చూసి ప్రతిపక్షాలు దిమ్మతిరిగి పోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.

బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి పార్టీ కార్యకర్త అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతం ఉద్యమాలకు గడ్డగా మారిందని తెలిపారు.

ఈ ఉద్యమ గడ్డపై సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. కామారెడ్డిలో పోటికి ఎవరొచ్చినా  గంప కింద కమ్ముడేనని మంత్రి కేటీఆర్ అన్నారు.ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.


ఈ ప్రాంతం నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ఏమో ఉద్ధరిద్దామని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

 పలు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా కామారెడ్డి ప్రాంతం ఉందన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించి రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. 200 పింఛన్ ఇవ్వనోడు రూ.4000 పింఛన్ ఎలా ఇస్తాడని కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటిసారిగా ఈ ప్రాంతం నుండి ప్రారంభం అయిందని ఆయన తెలిపారు...

Comments