జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డును శాశ్వత మార్కెట్ గా ప్రకటించాలి

 *జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డును శాశ్వత మార్కెట్ గా ప్రకటించాలి*

*మార్కెట్ సమస్యపై ఎమ్మెల్యే అభ్యర్థులు స్పష్టమైన హామీ ఇవ్వాలి*

*సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ డిమాండ్*

సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావధాతిరం నాయక్



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఉపమార్కెటను ఏన్కూర్ మార్కెట్ యార్డ్ నుంచి విడగొట్టి శాశ్వత మార్కెట్ యార్డ్ గా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జూలూరుపాడు ఉప మార్కెట్ యాడ్ లో కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ

 జూలూరుపాడు ప్రత్తి ఉప మార్కెట్ రెండవ గుంటూరు మార్కెట్ గా ప్రసిద్ధి చెందిందని, ఏన్కూర్ మార్కెట్ కు అనుసంధానంగా ఉండటం మూలంగా ఇక్కడ ఎటువంటి సౌకర్యాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం సరైనది కాదని విమర్శించారు.

 కోట్ల రూపాయలు సెస్ రూపంలో వస్తున్నప్పటికీ ఉపమార్కెట్లో రైతులకు కార్మికులకు కనీస సౌకర్యాలు లేవని, తక్షణమే షెడ్లు విశ్రాంతి గదులను మరుగుదొడ్లను నిర్మించాలని, మార్కెట్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మార్కెట్ సమస్యపై వైరా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్లు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన కోరారు.

మార్కెట్లో పనిచేస్తున్న కార్మికులకు ఇన్సూరెన్స్ రక్షణ సౌకర్యాలు కల్పించాలని  కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) జిల్లా సహాయ కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భానోత్ ధర్మ, నాయకులు లింగాల వీరభద్రం మార్కెట్ హమాలి మేస్త్రీ లు పప్పుల జాను, పోతురాజు బోడయ్య, ఇల్లంగి సుందర్రావు, గతం భాస్కరరావు, ఇసాక్, మందా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments