ఢిల్లీ ఆడించినట్లు ఆడే తోలుబొమ్మల చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే మన భవిష్యత్ ఆగం

 *ఢిల్లీ ఆడించినట్లు ఆడే తోలుబొమ్మల చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే మన  భవిష్యత్ ఆగం*


*సుస్థిరమైన కేసీఆర్ పాలనకే జై కొడదాం.. తెలంగాణ ప్రగతిని కొనసాగిద్దాం*


సికె న్యూస్ ప్రతినిధి జవాజి ప్రవీణ్ కుమార్ 


 *బానోత్ హరిప్రియ నాయక్*



*ప్రశాంత వాతావరణంలో సుపరిపాలన అందిస్తూ...*

*అభివృద్ధి ,సంక్షేమం కోసం రోజు ప్రజల కోసం పనిచేస్తున్న హరిప్రియ నాయక్ కే మద్దతు తెలుపుతున్న "కామేపల్లి"* *ప్రజానీకం...*


*జాస్తి పల్లి  గ్రామంలో మహిళలు కోలాట నృత్యాలతో అలరిస్తూ అశేష జనవాహినిలో  హరిప్రియ నాయక్ కు ఘన స్వాగతం,,,,* 


*కామేపల్లి మండలం నెమలిపురి, పాత లింగాల, పింజర మడుగు, టేకుల తండా, తాళ్ల గూడెం, జాస్తి పల్లి గ్రామపంచాయితీలలో ఇల్లందు నియోజకవర్గ బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ నాయక్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు...* 


 *ప్రచార సభలలో హరిప్రియ నాయక్  మాట్లాడుతూ...*


*ప్రచారంలో భాగంగా గత 5 సంవత్సరాలలో గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన హరిప్రియ నాయక్ ...*


*ఏమి చేస్తే రైతు బతుకుతాడు అనే ఉద్యేశంతో వ్యవసాయానికి అవసరమైన సాగునీరు, కరంటు, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. మద్దతు ధరతో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు*...

*బీ ఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే తాండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చి బంజారాలకు స్వయం పరిపాలన అందించింది*... *గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందజేసిన గొప్ప నాయకుడు కేసీఆర్*


*బీ ఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆసరా పెన్షన్ రూ. 2016 నూతన ప్రభుత్వంలో రూ. 5016లు అందిస్తాం.*


*వికలాంగులకు ప్రస్తుతం ఉన్న రూ. 4016 లను ఎన్నికల తరువాత 6016 లకు పెంచుతాము...*


*గతంలో 70 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు సరిగ్గా పనిచేసి ఉంటే ఈనాడు దేశంలో, రాష్ట్రంలో అసలు సమస్యలు లేకుండే....

*తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో అద్భుతమైన ప్రగతి జరిగింది.* 

*ప్రతి ఇంటికి* *సంక్షేమ పథకాలు* 

*అందుతున్నాయి*...*


*24 గంటల నాణ్యమైన కరంటు సరఫరా చేస్తున్నాం...*


*విత్తనాలు, ఎరువుల కు కొరత లేదు,రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నాం....*

*పండిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాం.*


*దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతుబీమా అందిస్తున్నాం.*


*మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నాం.*


*ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం లక్షా నూటపదహార్ల ఆర్థిక సహాయం ఇస్తున్నాం.*


*గర్భవతులకు న్యూట్రిషన్ కిట్, డెలివరీ తరువాత కేసీఆర్ కిట్ ఇస్తున్నాం.*


*బీ ఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నది.*


*అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షలతో కేసీఆర్ భీమా-పేదలకు దీమా ప్రారంభిస్తాం.*


*రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రస్తుతం ఏటా ఎకరాకు రూ..10,000 లు రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. ఎన్నికల తరువాత  16,000 వరకు ఇస్తున్నాము...* 


*రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ. రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.*


 *కొంతమంది నాయకులు ప్రచారానికి వస్తారు. అలివికానీ హామీలు ఇస్తున్నారు ఇల్లందు అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు...*


*ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...*

Comments