పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు
# పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు..
# మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశం
# సెల్‌ఫోన్లు స్వాధీనం
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో గురువారం వేకువజామున 3 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు.. మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసంపై ఐటీ దాడులు జరగొచ్చని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు రావడం గమనార్హం.
ఈసీ అధికారులు బిజీ బిజీ
#నాపై ఈడీ దాడులు జరగవచ్చు: పొంగులేటి
కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ ఈడీ దాడులు జరగనున్నాయి. ఊహించని రీతిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఎన్నికల కమిషన్ సోదాలు చేపట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
తుమ్మల నివాసంలో..:
మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఈసీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని శ్రీ సిటీలోని తుమ్మల ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పలు పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రతీకారంగానేనా..?:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మంత్రి అజయ్ సూచన మేరకు కలెక్టర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు బోసగ్ ఓట్లను చేర్పించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై ఎన్నికల అధికారులకు , జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆ ఫిర్యాదులో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీసిటీ నివాసంలో సోదాలు జరగటం గమనార్హం.
బాక్స్:
నాపై ఐటీ దాడులు జరగొచ్చు: పొంగులేటి
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందన్నారు. భాజపా, భారాస కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని పొంగులేటి వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్‌లో చేరితే భాజపా, భారాస ఇబ్బందులు పెడతాయని ముందే ఊహించాను. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. అందుకే దీనిలో చేరాను. కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు లీకులు వెంటాడుతున్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థలే నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కొందరు పోలీసులు భారాసకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Post a Comment