హరిప్రియకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు

హరిప్రియకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ నాయక్ తమ ప్రచారంలో భాగంగా గ్రామస్తులు నల్ల జెండాలతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు .


గో బ్యాక్ గో బ్యాక్ హరిప్రియ, గ్రామంలో గిరిజనేతరులకు , గిరిజనులకు అందరికి పోడు పట్టాలు, డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదని , రోడ్లు బాగా లేవని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు తెలుపుతూ ప్రచారానికి అడ్డగించారు. 

తమ గ్రామంలో అధికార పార్టీ నాయకులు ప్రచారానికి అనుమతి లేదని నినాదాలు తెలిపారు . బీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామస్తుల నుండి తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేస్తూ తోపులాట చేసుకున్నారు.


దీనిపై అక్కడికి ప్రచారానికి వచ్చిన హరిప్రియ నాయక్ అడ్డగించిన నిరసన కారులను ఉద్దేశించి ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది . ఇలా ప్రతిఘటించడం పద్ధతి కాదు . 

మీ పార్టీ వాళ్లు ప్రచారానికి వస్తే ఇట్లనే చేస్తారా ... ఏమైనా మీ సమస్యలు ఇబ్బందిగా ఉంటే నేను చూసుకుంటా .. ఇలా చేయడం సరికాదు, దయ చేసి ప్రచారానికి అడ్డు లేకుండా చేసి తమ ప్రచార రథం ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలని వారి పార్టీ కార్యకర్తలను కోరారు . దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి తమ ప్రచారాన్ని ఆ గ్రామంలో నిర్వహించకుండానే గౌరారం వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.

Comments