ఖమ్మం జిల్లా త్రిమూర్తులకు భారీ గజమాలతో ఘన స్వాగతం

 ఖమ్మం జిల్లా త్రిమూర్తులకు భారీ గజమాలతో ఘన స్వాగతం

కూసుమంచి: ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల నుండి మంత్రులు అయి ప్రమాణ స్వీకారం తరువాత మొదటి సారి ఖమ్మం కు రావడం జరిగింది.


 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చారు.

 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఖమ్మం రావడంతో కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. 

భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.

 రోడ్డు మార్గం ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం.

Comments