భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి చంపి ఆపై....
*స్కూల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆవేశంతో గన్‌మెన్ చేసిన ఘాతుకం*
సిద్దిపేట: జిల్లాలోని చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్ నరేష్..
తన భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి చంపేశాడు. ఆపై నరేష్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతులు ఆకుల నరేష్ (కలెక్టర్ గన్ మెన్), చైతన్య (భార్య), రేవంత్ (కుమారుడు), హిమా శ్రీ (కుమార్తె)గా గుర్తించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ అయినట్టు సమాచారం.
ఈ గొడవల కారణంగా స్కూలుకు వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చిన నరేష్.. ఆవేశంగా తన దగ్గర ఉన్న గన్‌ను తీసుకొని మొదటగా పిల్లలను కాల్చి తర్వాత భార్యను.. ఆపై తనకు తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..
Comments
Post a Comment