ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న మట్టి , ఇసుక మాఫియా గ్యాంగ్ లు
ఇసుక మట్టి ఆఫీయా పై అధికారులు తమ కొరడ జులిపించినారు .
సత్తుపల్లి ,వెంసూరు మండలలో బండ్లు పట్టివేత.
సీకే న్యూస్ సత్తుపల్లి మేజర్,
మూనీర్ .
డిసెంబర్ 14.
గ్రామాలలో ఇష్టారాజ్యంగా మట్టి , ఇసుక మాఫియా గ్యాంగ్ లు రెచ్చిపోతున్న నేపథ్యంలో బుధవారం నాడు అధికారులు తమ జులును విదిలించి మాఫియా పై కోరడ జులిపించినారు.
సత్తుపల్లి , వేంసూర్ మండలాలలో దాడులు చేసి మట్టి ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను ,మాఫియా పై కేసులను నమోదు చేశారు.
ఈ క్రమంలో వేంసూరు మండలం దుద్దిపూడి గ్రామం తమ్మిలేరు కాలువ నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా 2 ట్రాక్టర్లను ,సత్తుపల్లి మండల తుంబూరు గ్రామం లో ఇసుక రవాణా చేసే 2 ట్రాక్టర్లను, కొమ్మేపల్లి లో అక్రమ మట్టి రవాణా చేసే 2 లారీలు 1 హిటాచి ప్రోక్లైన్ ను అధికారులు సీజ్ చేసి కేసులను నమోదు చేయడం జరిగింది.
గత ప్రభుత్వ నేతల అండదండలను చూసుకొని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి మట్టి ఇసుక మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ రవాణా చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో తాము ఎన్నిసార్లు కంప్లైంట్ లు చేస్తున్నా ప్రభుత్వం మాది నేతలు మా పక్షాన ఉన్నారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మట్టి మాఫియా రేచ్చిపోయిందని ఇప్పటికైనా అధికారులు మాఫియా పై కొరడా చిలిపించడంతో గ్రామాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment