*కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రవేశానికై ప్రకటన....*
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 13
2024 - 25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో 6 వ తరగతి, 9 వ తరగతులలో ప్రవేశానికై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటనను వెలువరించిందని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు.దీని ప్రకారం ఆరవ తరగతిలో బాల బాలికల ప్రవేశం కొరకు 10 నుండి 12 సంవత్సరాల వయసు 31.03. 2024 వరకు ఉండి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 9వ తరగతిలో బాలబాలికల ప్రవేశం కొరకు 13 నుండి 15 సంవత్సరాల వయసు 31.03. 2024 వరకు ఉండి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్, రక్షణ దళాల్లో పని చేయువారు, ఓబిసి విద్యార్థుల ప్రవేశ పరీక్ష ఫీజు 650 రూపాయలుగా , ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 500 రూపాయలుగా నిర్ణయించారని తెలిపారు. https://exams.nta.ac.in/AISSEE/ అనే వెబ్ సైటు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 16.12.2023 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని, ప్రవేశ పరీక్ష ఆన్లైన్ ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 16.12. 2023 రాత్రి 11.50 గంటల వరకు కలదని, ప్రవేశపరీక్ష 21.01.2024, ఆదివారం రోజున ఓఎంఆర్ పద్ధతి ద్వారా నిర్వహించబడుతుందని, మరిన్ని వివరాలకై www.nta.ac.in లేదా https://exams.nta.ac.in/AISSEE/ అనే వెబ్సైటును సందర్శించాలని తెలిపారు.
Comments
Post a Comment