ఆదివాసి కుటుంబాలకు అండగా మేము ఉంటాం. ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయిదయానంద్

 -- ఆదివాసి కుటుంబాలకు  అండగా మేము ఉంటాం.


-- ఎమ్మెల్యే  డాక్టర్ మట్ట రాగమయి, మట్టా దయానంద్




--సీకే న్యూస్ సత్తుపల్లి మేజర్.

-- మునీర్


డిసెంబర్ 13.



పెనుబల్లి మండల పరిధిలోని  చాకలి చౌడారం గ్రామం లో నివసిస్తున్న గుత్తి కొయల కుటుంబాల ను సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్ట రాగమయి మట్టా దయానంద్ కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొని అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించినారు.


 ఈ కార్యక్రమంలో అదునాతన నూతన అభివృద్ధి జీవితంలో నడుస్తున్న రోజుల్లో కూడా నేటికీ కనీసం త్రాగు నీరు,ఇంటికి కరెంటు, రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతు, కనీస సౌకర్యాలు లేక చీకటి జీవితాలు గడుపుతున్న ఆదివాసీ కుటుంబాల భాదలు నివసిస్తున్న గ్రామస్తులు అడిగి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తెలుసుకున్నారు.


 గుత్తికొయులు కుటుంబాలకు రేషన్ కార్డు లు, ఆధార్ కార్డులు , ఓటు హక్కు ఇచ్చిన గత ప్రభుత్వాలు వారికీ మాత్రం కనీస మానవ జీవిత సౌకర్యలు మాత్రం అందించలేదు అని ఎమ్మెల్యే ప్రశ్ననించినరు.


మానవతా దృక్పధం తో అందరం వారి కుటుంబాలకు అండగా ఉందాం అని  చాకలి చౌడారం గ్రామ అధ్వనా పరిస్థితి ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి , ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రివర్యులకు తెలియజేసి న్యాయం చెయ్యటానికి కృషి చేస్తానని  సత్తుపల్లి నియోజకవర్గo ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు . పలు గ్రామాల సమస్యలు పై సంబంధిత  అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యలకు తగిన  పరిష్కారం జరిగే విధంగా చూస్తామని గ్రామస్తులకి హామీ ఇచ్చినారు .


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, టిడిపి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments