*మా ప్రాణాలు కాపాడండి మహాప్రభో.*
--శ్వాసకోశ వ్యాధులు , కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం బారిన గ్రామస్తులు.
-- ట్రైన్ లోడింగ్ ఆపివేయాలని నిరసన.
సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీకి అతి సమీపంగా నిర్మించిన సింగరేణి శైలో బంకర్ (ట్రైన్ లోడింగ్ పాయింట్) నుండి వెలువడె దుమారం తీవ్ర స్థాయికి చేరింది. ఈ దుమారం వల్ల కాలనీలోని ప్రజలు చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు శ్వాసకోశ వ్యాధులు మరియు కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం బారిన పడుతున్నారు.
ఈ విషయంపై ఆందోళన చెందిన ప్రజలు తక్షణమే ట్రైన్ లోడింగ్ ఆపివేయాలని నిరసన తెలిపేందుకు లోడింగ్ పాయింట్ కు వద్దకు చేరుకుంటున్న సమయంలో ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు వారిని నిలువరించారు, ఈ సందర్భంగా నిరసనకారులకు మరియు పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడింది.
ఆందోళన కారులు మా ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ఎంత కాలంగానో జీవిస్తున్న మా గ్రామాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని తీసుకొని మాకు ప్రత్యామ్నాయం కల్పించాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు.
కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు కొంత సమయం తర్వాత సంఘటన స్థలాన్ని చేరుకొని వారం రోజుల వ్యవధి లో కొంత, మూడు నెలల వ్యాధిలో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు సమక్షంలో నిరసనకారులకు హామీ ఇచ్చారు. హామీతో నిరసన విరమించిన అంబేద్కర్ నగర్ కాలనీవాసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు సూచనతో ఘటనా స్థలం నుండి వెనుతిరిగారు.
ఈ కార్యక్రమంలో కొండ నాగరత్నం, పాలకుర్తి రజిని, పాలకుర్తి సుశీల, వేము సందీప్, వాడపల్లి నాగమణి, పాలకుర్తి రాజు, మారోజు నాగేశ్వరరావు, మారోజు శ్రీను, కొత్త లక్ష్మి, కండె నాగరాజు, కడారి రమేష్, వాడపల్లి వెంకటేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment