ఓ పత్రిక విలేఖరి నగేష్ అక్రమంగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ వెంటనే స్వాధీనం చేసుకోండి
స్వాధీనం చేసుకోకపోతే నిరుపేదలను వారి ఇంట్లోకి చొరగొడతాం
అక్రమంగా హౌసింగ్ బిల్లులు ఇచ్చిన ఏఈ నాగేశ్వరరావును , తహసీల్దార్లను వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపాలి
డబుల్ బెడ్ రూమ్ బిల్లులు అనర్హులకు ఇస్తున్నారా
అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వండి
రుద్రూర్ మండల కేంద్రంలో రుద్రూర్ ఓ పత్రిక విలేకర్ నగేష్ కు ఏ విధంగా ప్రభుత్వ స్థలం ఏ విధంగా డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చారని, సదురు ఓ పత్రిక విలేఖరి ఈ మండల్ వ్యక్తి కాదని ఈ గ్రామానికి చెందినవారు కాదని ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఓటింగ్ హక్కు కూడా ఇక్కడ లేదని, సదరు ఓ పత్రిక విలేఖరి ఎడపల్లి మండల కేంద్రం చెందిన వారు అని అక్కడ ఆయనకు వ్యవసాయ భూములతో పాటు ఇల్లు తో పాటు వారి ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉందని
అలాంటి వ్యక్తి అన్హరుడు అయినప్పుడు రుద్రూర్ మండల కేంద్రంలో ఏ విధంగా ప్రభుత్వ స్థలం ఇచ్చారని ఏ విధంగా హౌసింగ్ బిల్లులు ఇచ్చారని ఈ బిల్లులు ఇచ్చిన ఏ ఈ నాగేశ్వరరావుకు ప్రభుత్వ స్థలం ఇచ్చిన ఎమ్మార్వోలను వెంటనే సస్పెండ్ చేసి వారికి జైలుకు పంపాలని, డిమాండ్ చేస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది,
ఈ ధర్నాల లో భాగంగా అశోక్ మాట్లాడుతూ రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ సమీపంలో పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ప్రభుత్వ స్థలంలో నగేష్ పత్రిక విలేఖరి అనహర్వుడిగా ఉన్నప్పటికీ ఆయనకు డబుల్ బెడ్ రూమ్ తో పాటు ప్రభుత్వ స్థలం ఏ విధంగా ఇచ్చారంటూ ఇప్పటికీ వందలసార్లు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు ఇచ్చి ఉన్నామని అయినప్పటికీ ఎమ్మార్వో కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోలేదని, ఇచ్చిన దరఖాస్తులన్నీ ఫిర్యాదు పత్రాలు అన్ని చెత్తబుట్టలో పడేసినట్టు సమాచారమని,
కారణం ఓ పత్రిక విలేఖరికి రాజకీయ నాయకుల అండదండలు ఉండబట్టే , గతంలో చర్యలు తీసుకునే అధికారులపై ఒత్తిడి ఉండబట్టే, చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని లేక మామూళ్ల మత్తులో మునిగి ఉండడమే అని అనుమానంగా ఉందని ఆయన మండిపడ్డారు.
నగేష్ కు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చిన అదేవిధంగా ప్రభుత్వ స్థలం ఇచ్చిన హౌసింగ్ శాఖ ఏఈ అయినా నాగేశ్వరావును వెంటనే సస్పెండ్ చేసి వారికి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అలహర్వుడిగా ఉన్న ఓ పత్రిక విలేకరి నగేష్ కు ఏ విధంగా ప్రభుత్వ స్థలం డబుల్ బెడ్ రూమ్లు ఇస్తారని ఇలాంటి వ్యక్తికి ఇచ్చిన అధికారులు అక్రమదారులే అవుతారని అవినీతిపరులు అవుతారని అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని హెచ్చరించారు.
ఎంతోమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతోమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతోపాటు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఉందని అయినప్పటికీ కొంతమంది మిగిలిపోయారని అలాంటి వారికి కూడా న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయనతోపాటు సాయిలు, లింగం తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment