మేడిగడ్డ ఇష్యు పై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం

మేడిగడ్డ ఇష్యు పై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇవాళ ఉత్తమ్ తొలిసారి హైదరాబాద్‌లోని జలసౌధకు వెళ్లారు. 


ఈ సందర్భంగా మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై విచారణ జరగాలని అన్నారు. బ్యారేజీ పిల్లర్లు కుంగటం అనేది చాలా తీవ్రమైన అంశంమని..

 మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లేందుకు టూర్ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శించే సమయంలో ప్రాజెక్ట్ నిర్మించిన ఏజెన్సీ, అధికారులు తనతో పాటు ఉండాలని ఆదేశించారు. 

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలని.. ఎంత ఆయకట్టుకు నీరు ఇచ్చేలా బ్యారేజీ నిర్మాణం జరిగిందో చెప్పాలని అన్నారు.

ఒక్కో ఎకరాకు సాగు నీరు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతోందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 

తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందని, ప్రజల డబ్బులతో ప్రాజెక్ట్‌లు కడుతున్నామని తెలిపారు. అత్యంత పారదర్శంగా పనులు ఉండాలని.. అపోహలు తొలగిపోయేలా పని చేయాలని అధికారులకు సూచించారు.

Comments