బీజేపీ కార్యకర్తపై దాడి.. నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయాలని కొత్త సీఎం ఆదేశం

 భోపాల్‌: బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్‌గా స్పందించారు. బుల్డోజర్‌తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.

దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు. మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్త దేవేంద్ర ఠాకూర్‌పై ఫరూఖ్ రెయిన్ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ దాడిలో దేవేంద్ర చెయ్యి తెగింది. ఈ కేసుకు సంబంధించి ఫరూఖ్ రెయిన్‌తోపాటు అస్లాం, షారుక్, బిలాల్, సమీర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, మధ్యప్రదేశ్‌ కొత్త సీఎం మోహన్ యాదవ్ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్త దేవేంద్ర ఠాకూర్‌పై దాడికి పాల్పడి చేతిని నరికిన నిందితుడు ఫరూఖ్ రెయిన్ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు గురువారం ఆ ఇంటిని కూల్చివేశారు. కొత్త సీఎం మోహన్ యాదవ్ ఈ మేరకు తొలి ఆదేశం ఇవ్వడం చర్చకు దారి తీసింది.


Comments