హరీష్ రావు అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండుగ
మంత్రి పొంగులేటి
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లా :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకముందే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లా డుతున్నారని రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం లో మహాలక్ష్మి పథకాన్ని ఉప ముఖ్య మంత్రి భట్టి, మంత్రి తుమ్మల తో కలసి నేడు ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భగా పొంగులేటి మాట్లాడుతూ.విలువలు లేని హరీష్ రావు తెలంగాణను దోచి మామకి కట్ట పెట్టాడని సంచలన వ్యా ఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలా? అని ప్రశ్నించారు.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. తిన్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన మీరా? మా ప్రభుత్వం గురించి మాట్లాడేది అంటూ హరీష్ రావును ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణను 9 ఏళ్లలో దోచి అప్పుల రాష్ట్రంగా బీఆర్ ఎస్ ప్రభుత్వం తయారు చేశారన్నారు. దోచుకున్న డబ్బులన్నీ మీ మామ దగ్గర పెట్టారని అన్నారు
రైతుబంధు పైసలు వేయడానికి మూడు నెలల సమయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ మా గురించా?మాట్లాడేది అంటూ నిప్పులు చెరిగారు. అప్పుడే ఏముంది ముం దుంది ముసళ్ల పండుగ అంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టు కోసం ప్రయ త్నాలు చేస్తుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇంది రమ్మ రాజ్యం కావాలని మమ్మల్ని గెలిపించారని తెలిపారు. శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెం టీల పై సంతకాలు చేసారు మన ముఖ్యమంత్రి అని తెలిపారు. తూతూ.. మమ.. అనుకోకుండా చెప్పిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్న ప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు..
Comments
Post a Comment