ఎరువుల గోదాములో ఆకస్మిక తనిఖీ...

ఎరువుల గోదాములో ఆకస్మిక తనిఖీ...

బిల్లులు లేకుండా అతిగా నిలువ ఉంచితే కఠిన చర్య తప్పదు.

-- ఎరువుల గోదాములు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల.

సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.



జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడే ఎరువుల నిలువలు అందుబాటులో ఉన్నాయని ప్రధానంగా నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు మాత్రమే వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎమ్ విజయ నిర్మల సూచించారు.

గురువారం మండల పరిధిలోని పలు సహకార సంఘాలు , ఎరువుల డీలర్ల కు సంబంధించిన దుకాణాలు మరియు గోదాములలో ఉన్న నిల్వలా పై తనిఖీ నిర్వహించినారు.

 అధికారి మాట్లాడుతూ ఎరువుల క్రమ విక్రయాలలో రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని షాపులో ఉన్న స్టాక్ కి  నిల్వలు గోదాంలో నిల్వల కు  వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని అనుమతి లేని బిల్లులు ఇన్ వాయిస్ లేకుండా నిలువ మించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వై శ్రీనివాసరావు ఎంఈఓ టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments