25.16 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
నవంబర్ 29,
ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం మణుగూరు రూట్ వాచ్ మరియు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 25.16 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విలువ సుమారు 6,25,000/- ఉంటుందని తెలిపారు. వారి వద్ద నుంచి 01 మొబైల్ ఫోన్, 1 ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ మనుగురులకు అప్పగించారు.
అరెస్టు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. తెరపతి కళ్యాణ్ నివాసం: మిర్యాలగూడ,2) చట్టం నివాసం: ఖమ్మం.
ఈ రైట్ లో ఎస్. రమేష్ (పీ, ఇసి), ఎంఏ కరీం హెచ్ సి, కే సుధీర్ (ఇసి), టి వెంకట్ (ఇసి), పి విజయ్ (ఇసి), పీ హరీష్ (ఇసి), కె. ఉపేందర్ (ఇసి) పాల్గొన్నారు,
Comments
Post a Comment