డిసెంబర్ 3ను తెలంగాణ యూత్ డే గా ప్రకటించాలి

 *డిసెంబర్ 3ను తెలంగాణ యూత్ డే గా ప్రకటించాలి*


*తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులకు 5 శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించాలి*


*టి జె యస్ పార్టీ జిల్లా కన్వీనర్ భట్టు రాజేందర్*


*సి కె న్యూస్ ప్రతినిధి*

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానానికి పాల్పడ్డ విద్యార్థి శ్రీకాంతాచారిమరణం వెలకట్టలేని త్యాగం. వారు ఆత్మ బలిదానం చేసుకున్న డిసెంబర్ 3 ను తెలంగాణ యూత్ డే గా తెలంగాణ జనసమితి రాష్ట్ర యువజన విభాగం పిలుపు మేరకు  ఖమ్మంలో డిసెంబర్ 3 న తెలంగాణ యూత్ డే కు సంబంధించి పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.


ఆత్మ బలిదానాల పునాదిపై ఏర్పడ్డ తెలంగాణాను గత పాలకులు 10 సంవత్సరాలుగా వారి ఆస్తులు పెంచుకొని విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడి తెలంగాణ నినాదమైన నిధులు, నీళ్ళు, నియామకాలు ప్రక్కన పెట్టి వారు, వారి కుటుంబీకులు, బంధువులు సంపాదించుకోడానికే తెలంగాణ సాధించుకున్నామని భ్రమలో వున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను అని చెప్పుకునే కే.సి.ఆర్. కుటుంబములో కాని, వారి బంధువులలో కాని ఏ ఒక్కరు ఆత్మ బలిదానానికి పాల్పడలేదని, అలాంటి కే.సి.ఆర్. మోసపూరిత వాగ్దానాలతో కాలం గడిపారన్నారు.


కాని  రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కె దక్కుతుందన్నారు అధికారాన్ని కోల్పోయి, బి.ఆర్.యస్. నేతలు అన్ను మిన్ను లేకుండా నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతు వాస్తవాలను వక్రీకరించి తమ చేతకాని తనాన్ని హరిష్ రావు, కే.టి.ఆర్.లు కల్లు త్రాగిన కోతుల్లాగా ఎగురు తున్నారని, నిరుద్యోగులు వీరి దుశ్చర్యలను గమనిస్తున్నారని, అధికారం కోల్పోయి, ఇక ముందు అవకాశాలు రావనిగమనించి, అనునిత్యం గోబెల్ ప్రచారానికి పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


రేవంత్ రెడ్డి పరిపాలన లోపాలు వుంటే, ప్రతి పక్ష పార్టీగా సమర్థవంతగా ఆ పాత్రను పోషించి పరిపాలన సజావుగా జరిగేటట్లు సలహాలు ఇస్తే ప్రజలు కూడా మిమ్ములను అభినందిస్తారు, విమర్షలు అతిగా చేయడం మూలంగా మీ హెూదాను దిగజార్చుకున్నావరౌతారని

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులకు 5 శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని డిసెంబర్ 3 న బషీర్ బాగ్, హైద్రాబాద్లో జరిగే యూత్ నాడు ప్రభుత్వం ప్రకటన ఆత్మ బలిదానానికి పాల్పడిన వారి ఆత్మ లకు శాంతి చేకూరాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిన పార్టీగా నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో టి జె యస్ పార్టీ ఖమ్మం జిల్లా యూత్ కన్వీనర్ భట్టు రాజేందర్ తో పాటు జ్వాలా వెంకటేశ్వర్లు, భూక్యా వెంకన్న, యోగి, త్రిపాఠి, అఖిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Comments