ఉప్పల్ లో నకిలీ ఆర్టీవో హల్చల్
హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో నకిలీ ఆర్టీవో హల్చల్ దందాలో ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది.
ఈ వ్యవహారంలో సూత్రధారి, ఆటోడ్రైవర్ ప్రేమ్కుమార్రెడ్డిని గురువారమే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పాత్రధారి సంతోష్ శుక్రవారం పట్టుబడ్డాడు. సంతోష్ అడ్డా కూలీ కావడం గమనార్హం.
వీరిద్దరూ సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్లను, ఇసుక, ఇటుక, కంకర రవాణా చేసే వాహనదారులను లక్ష్యంగా చేసుకొని దందా చేస్తున్నారు. రోజూ ఉదయం కారులో సంతోష్‌ను తీసుకొని ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఉప్పల్, నాగోల్, మేడిపల్లి, ఘట్కేసర్, బోడుప్పల్ ప్రాంతాలకు వెళ్తాడు.
కారులో సంతోష్‌ను కూర్చొబెట్టి చేతిలో ల్యాప్‌టాప్, ఇతర రశీదు పుస్తకాలను ఉంచి వచ్చిపోయే వాహనాలను ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఆపుతూ ఉంటాడు. సంతోష్‌ను ఆర్టీవోగా చూపుతూ.. వాహనాల పత్రాలను ప్రేమ్‌కుమార్‌రెడ్డి అడుగుతాడు.
ఏదైనా పేపరు లేకుంటే.. సారు వద్దకు పోతే చాలా జరిమానా వేస్తాడంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేసేవాడు. సంతోష్‌కు రూ.500 కూలీ ఇస్తూ మిగతా మొత్తం ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఉంచుకుంటున్నట్టుగా తెలిసింది.
Comments
Post a Comment