కేరళ బైపోల్స్..వయనాడ్లో లక్ష మెజార్టీతో ప్రియాంకగాంధీ
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్, యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో ఒక పార్లమెంటరీ, ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల రిజల్ట్స్ వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో ఉంది. ఇక జార్ఖండ్ లో ఇండియా కూటమి,ఎన్డీయే కూటమిలు పోటాపోటీగా లీడ్ లో కొనసాగుతుతున్నాయి.
యూపీలోని 9 అసెంబ్లీ స్థానాల ఫలితాల్లో బీజేపీ కూటమి 6సెగ్మెంట్లలో, మూడింటిలో ఎస్పీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు కేరళ బైపోల్స్ రిజల్ట్స్ లో వయనాడ్ లో కాం గ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ దూసుకుపోతోంది.
ఎల్ డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరీ కంటే లక్షా 4వేల మెజార్టీతో లీడ్ లో ఉన్నారు. కేరళోని చెలక్కర అసెంబ్లీ స్థానం ఓట్ల లెక్కింపులో ఎల్ డీఎఫ్ అభ్యర్థి యూఆర్ ప్రదీప్ లీడ్ లో ఉన్నారు.
ప్రస్తుతం ప్రియాంక గాంధీ 4 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె తర్వాతి స్థానాల్లో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఉన్నారు.
వయనాడ్‌లో గెలవడం కాదు.. ఏకంగా 5 లక్షల మెజారిటీ రావాలనే లక్ష్యంతో ప్రచారం చేశారు. స్వయంగా సోనియా గాంధీనే ప్రచారానికి వచ్చారు. వయనాడ్ ఉప ఎన్నికలో మొత్తం 16 మంది అభ్యర్ధులు పోటీకి దిగారు. 16 మంది పోటీలో ఉన్నా.. అదంతా నామమాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు తగ్గట్టే.. భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు ప్రియాంక. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గెలిచిన రాహుల్.. మొన్నటి ఎన్నికల్లో వయనాడ్ నుంచి సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3 లక్షల 60వేల మెజారిటీతో గెలిచారు రాహుల్‌గాంధీ. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. పైగా ప్రియాంకగాంధీ మొదటిసారి ఎన్నికల బరిలో ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వయనాడ్‌లో ప్రియాంక ఈజీ విక్టరీ సాధిస్తారని తేల్చాయి. ఇప్పటికే.. వయనాడ్ లోక్‌సభ స్థానం గాంధీల కంచుకోటగా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది. 2019లో రాహుల్‌గాంధీ గెలిచారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరోసారి రాహుల్‌గాంధీ గెలిచారు. అయితే.. రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలో కూడా గెలవడంతో.. వయనాడ్‌ను వదులుకున్నారు. ఇప్పుడు ఆ స్థానానికి పోటీ చేశారు ప్రియాంక గాంధీ.
ప్రస్తుతం గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది రాహుల్‌గాంధీ ఒక్కరే. అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ క్రియాశీలకంగా ఉండడం లేదు. అప్పటి నుంచి రాహుల్ ఒక్కరే పార్టీని నడిపిస్తున్నారు. రాహుల్‌గాంధీకి సపోర్ట్‌గా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు ప్రియాంకగాంధీ. 2019లోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు ప్రియాంక. ఇప్పుడు వయనాడ్ స్థానం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్నారు.
ప్రియాంకగాంధీ గెలుపు దాదాపు ఖాయమైనట్టే. ఇక తేలాల్సింది ఎంత మెజారిటీ వస్తుందనే. ప్రియాంక గెలుపుతో ఓ కాంబినేషన్ సెట్ అయినట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన అన్నయ్య రాహుల్‌గాంధీ, దక్షిణాదిన చెల్లెలు ప్రియాంకగాంధీ. ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని నడిపించబోతున్నారంటూ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాదిన పార్టీపై రాహుల్‌గాంధీ ఫోకస్ పెడితే.. దక్షిణ భారతంలో ప్రియాంకగాంధీ పార్టీని లీడ్ చేస్తారని చెబుతున్నారు.
Comments
Post a Comment