*రాజ్యంగ పరిరక్షణ ఎస్ఎఫ్ఐ బాధ్యత*
*రాజ్యం... మతం ఒక్కటి కాదు*
+ *రాజ్యాంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో బీజాలు*
+ *సమాజం పట్ల స్పందించే గుణాన్ని ఎస్ఎఫ్ కల్పిస్తోంది..*
+ *భారత రాజ్యాంగం మతానికి కాదు... మతోన్మాదానికే వ్యతిరేకం*
+ *భారతదేశం కార్పొరేట్ల రాజ్యమైంది..*
+ *ఎస్ఎఫ్ఎ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు ప్రొఫెసర్ నాగేశ్వర్, వి. కృష్ణయ్య*
+ *1500 మంది వరకు హాజరు...*
+ *ఆటపాటలతో ఉత్సాహంగా సాగిన సమ్మేళనం*
*సి కె న్యూస్ ప్రతినిధి:*
రాజ్యాంగ పరిరక్షణ ఎస్ఎఫ్ఐ బాధ్యతని, గాంధీజీ చెప్పినట్లు రాజ్యం.. మతం ఒక్కటి కాదని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బీజాలు వేయాలన్నారు. భారత రాజ్యాంగం మతానికి కాదు... మతోన్మాదానికే వ్యతిరేకమని తెలిపారు. సమాజం పట్ల స్పందించే గుణాన్ని ఎస్ఎఫ్ కల్పిస్తోందని తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్ ఏచూరి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఎఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఎస్ఎఫ్ విజయవాడ మహాసభ ఓ నినాదం ఇచ్చింది... 'ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఈజ్ ఏ కంప్లీట్ స్టూడెంట్' అని నమ్మితే మనం ఎక్కడున్నా ఎస్ఎఫ్ఐ విలువలతో నడుచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సమాజం పట్ల స్పందించటమనేది మనకు ఎస్ఎఫ్తా నేర్పిందన్నారు. మరో రెండు రోజుల్లో భారత రాజ్యాంగ స్వర్ణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఓ చారిత్రకతను సంతరించుకుందన్నారు. ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఎ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలుగునాట రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి బీజాలు వేయాలన్నారు.
రాజ్యాంగ విలువలపైన ఎందుకు ఉద్యమం జరగకూడదు అని ప్రశ్నించారు. మతాన్ని విద్వేషంగా వాడుతున్న వారితో ఏ రకంగా ఎస్ఎఫ్ ఉద్యమంలో పోరాడామో... ఇప్పుడు కూడా ఆ మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక అంకురార్పణ కావాలన్నారు. మత విద్వేషాలను వ్యతిరేకించే శక్తి రాజ్యాంగానికి ఉందన్నారు. భారతరాజ్యాంగం మతానికి వ్యతిరేకం కాదన్నారు. జస్టిస్ చిన్నపరెడ్డి ఒక తీర్పులో లౌకిక రాజ్యాంగం మతాతీత సమాజాన్ని కాదు... మతాతీత రాజ్యాన్ని కోరుతుందన్నారు. రాజ్యానికి మాత్రం మతం ఉండకూడదన్నారు. గాంధీ మహాత్ముడు ప్రపంచ నాగరికతలో ఎక్కడ కూడా మతం... దేశం ఒక్కటి కాదన్నారని తెలిపారు. రాజ్యాంగ పరమైన ఆలోచనలను కల్పించడానికి ఈ సమ్మేళనం దోహదపడితే ఇదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఎఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలుగునాట రాజ్యాంగ పరిరక్షణకు బీజాలు వేయాలనేది తన కోరికగా చెప్పారు. 'రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం... రాజ్యాంగం పిలుస్తోంది' సమాజం పట్ల స్పందించే గుణాన్ని ఎస్ఎఫ్ ఇచ్చిందన్నారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే నినాదాన్ని ఎస్ఎఫ్ఎ ఇచ్చిన రోజు దాని లోతు తెలియకపోవచ్చు కానీ ప్రస్తుత సమాజంలో దాని ఆవశ్యకత ఏంటో బోధపడుతోందన్నారు. ఎస్ఎఫ్ ఉద్యమ సమయంలో భారత రాజ్యంగంలోని మౌలిక విలువలు... మతం, లౌకికతత్వంపై ఘర్షణ పడ్డామన్నారు.
ఇప్పుడు ఆ ఘర్షణ విశ్వరూపం చూస్తున్నామన్నారు. మత విశ్వాసాలున్న ప్రజలందర్నీ తాము వ్యతిరేకించాల్సిన అవసరం లేదు... కానీ మతం ఆధారంగా రాజకీయ సమీకరణాలు, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని, మతాన్ని జాతీయతతో ముడిపెట్టే ఆలోచనలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మన పోరాటం మతంపైన కాదు..మత ఉన్మాదం పైన అన్నారు. మత విద్వేషంపైనే జరిపే పోరాటంలో ఆఖరికి శ్రీ కృష్ణ పరమాత్మ కూడా కలిసి వస్తాడన్నారు. భగవత్గీత ఏడో అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు 'ఎవరికి ఎవరియందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నా... వారిలో వారియందు భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తాను.. అర్జున' అన్నారు. క్రీస్తును నమ్మేవాళ్లకు ఏసు పైన, అల్లాను విశ్వసించే వారికి అల్లాపైన విశ్వాసాన్ని కృష్ణుడే కల్పిస్తాడు... ఇక విద్వేషాలకు చోటెక్కడిదీ..? అని ప్రశ్నించారు. 'ఎవరు కరుణతో..దయతో.. నిర్మలమైన మనస్సుతో..' నన్ను సేవిస్తారో వారే నాకు అంత్యంత ప్రీతిపాత్రులని కృష్ణుడు స్పష్టంచేసినట్లుగా వివరించారు.
అందుకే మత విశ్వాసాలు కలిగివున్న వారితో కాదు... మత విద్వేషాలు రెచ్చగొట్టే వారితో ఏ రకంగా ఎస్ఎఫ్ ఉద్యమంలో పోరాడామో ఇప్పుడు కూడా మత విద్వేషాల ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక అంకురార్పణ కావాలన్నారు. రాష్ట్రాల రాజకీయ ఉనికి పైన, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపైన, భారతీయత భావనపైన దాడి జరుగుతోందన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాయాలని, గంటకు గౌతమ్ అదానీ రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని, కానీ దేశంలో కటిక పేదరికంలో మగ్గేవారు అనేక మంది ఉన్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలుగునాట రాజ్యాంగ పరిరక్షణకు బీజం వేయాలనేది తన కోరికగా చెప్పుకొచ్చారు.*
*+ భారతదేశం కార్పొరేట్ల రాజ్యం:వి. కృష్ణయ్య*
మోడీ అధికారంలోకి వచ్చాక భారతదేశం కార్పొరేట్ల రాజ్యంగా మారిందని ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. ఎస్ఎఫ్ అంటే ఆకాశం ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తున ఆలోచించమనే భావోద్వేగం, అధ్యయనం పోరాటం నినాదం...మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పిన సిద్ధాంతం అన్నారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం మూడు లక్ష్యాలు ఢిల్లీలో మోడీ వచ్చాక ప్రమాదంలో పడ్డాయన్నారు. భారతరాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో మనందరికీ సీతారాం ఏచూరి విప్పిచెప్పారన్నారు. మోడీ పదేళ్లలో 252 చట్టాలు చేశారని, వీటి ద్వారా దేశంలో కార్పొరేట్ కంపెనీలు మన జీడీపీలు 3.5 ట్రిలియన్ డాలర్స్, 50శాతం కార్పొరేట్ కంపెనీల వాటా అయిందన్నారు. రైతుల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులన్నింటిపై కార్పొరేట్ కంపెనీల పెత్తనమేనని తెలిపారు. ప్రజల చేతుల్లో ఉ ండాల్సిన స్వాతంత్ర్యం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందని ప్రశ్నించారు. భారత స్టాక్ మార్కెట్లోని 1500 కంపెనీల్లో 50 శాతం కార్పొరేట్ వాటాగా సీతారాం ఏచూరి స్పష్టం చేశారన్నారు.
ప్రజలందరీ స్వాతంత్య్రం కార్పొరేట్ స్వాతంత్రంగా మారుతోందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సిన పార్లమెంట్ పది బాడీలన్నీ మోడీ, ఆర్ఎస్ఎస్ ఏ నిర్ణయం చేస్తే ఆ ప్రకారం జరగాల్సిందేనన్నారు. రాష్ట్రాల హక్కులను కూడా హరించి వేస్తున్నారని, చివరకు పంట కాల్వల్లో పారే నీరు కూడా తమ నియంత్రణలో ఉంటుంది, దానికి కావాల్సిన డబ్బులు పంపించమని రాష్ట్రాలకు కేంద్రం అల్టిమేటం జారీ చేసిందన్నారు. దేశంలోని 11 కోట్ల హెక్టార్ల భూములను రెండేళ్లలో డిజిటలైజ్ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగమైనా ఉంటుందా..? అంటే ఉండకూడదూ అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకున్నాయన్నారు. పెట్టుబడిదారి మార్కెట్ కోసం ప్రపంచాన్ని అణుయుద్ధం వైపు పయనింపజేస్తున్నారన్నారు. సోషలిజం వైపుగా ఈ ప్రపంచాన్ని నడిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వామపక్షాలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలు అవినీతి చేస్తే తప్ప నడవలేని పరిస్థితి ఉందన్నారు.*
*+ 1500 మంది హాజరు...*
ఎస్ఎఫ్ఎ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 1500 మంది వరకు హాజరయ్యారు. ఎస్ఎఫ్ఎ పూర్వ విద్యార్థులు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర తదితరులు ప్రసంగించారు. ఎస్ఎస్ఐ పూర్వ విద్యార్థులు ఆలపించిన గేయాలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భారతీయతకు భాష్యం, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన సీతారాంఏచూరి, జనవిజ్ఞాన వేదిక జీవ పరిణామం తదితర పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.
దీనికి ముందు ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి మాటూరి రామచంద్రరావు సహా అసువులు బాసిన ఎస్ఎఫ్ఎ పూర్వ విద్యార్థులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఎస్ఎఫ్ఎ ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి ఏజే రమేష్ ప్రవేశపెట్టారు. దీనికి ముందు ఎస్ఎఫ్ పతాకాన్ని సీనియర్ పూర్వ విద్యార్థి కొండపల్లి పావన్ ఆవిష్కరించగా... మరో విద్యార్థి ఉన్నం లక్ష్మీనారాయణ రాజ్యాంగ ప్రవేశిక పఠనం ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఎఫి పూర్వ విద్యార్థుల వేదిక కన్వీనర్ ఎం.సుబ్బారావు, ఎస్ఎఫ్ఎ ఆత్మీయ సమ్మేళనం కన్వీనర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విప్లవ్ కుమార్, అనురాధ, కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షవర్గంగా ఈ ఆత్మీయ సమ్మేళనం కొనసాగింది.
Comments
Post a Comment