తుపాకీ మిస్‌ఫైర్ అయి ఏఆర్ కానిస్టేబుల్ మృతి
తుపాకీ మిస్‌ఫైర్ కావటంతో ఏఆర్ కానిస్టేబుల్ గుంజి శ్రీనివాసరావు(50) మృతిచెందిన ఘటన గుంటూరులో చోటుచేసుకొంది.బుల్లెట్ నేరుగా ఆయన నుదుటి నుంచి దూసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సంపత్‌నగర్‌లోని శృంగేరి మఠం శ్రీశారద పరమేశ్వరీ దేవస్థానంలో విధుశేఖర భారతీస్వామి కార్యక్రమానికి శ్రీనివాసరావు ఎస్కార్ట్ విధులకు హాజరయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో సిబ్బంది అందరూ భోజనానికి వెళ్లారు. త్వరగా భోజనం చేసి వచ్చిన శ్రీనివాసరావు వాహనంలో ఉండగా, తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో బుల్లెట్ ఆయన నుదుటిపై దిగింది.
ఆయన్ను ఏఆర్ ఎస్సై, ఇతర సిబ్బంది అదే వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
ఏఆర్ కానిస్టేబుల్ స్వగ్రామం పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని మాదల. విషయం తెలిసిన ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని ఎమ్మెల్సీ యేసురత్నం సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.
Comments
Post a Comment