ఆలేరు, పాలేరు వాగు లను కబ్జా కోరుల నుండి కాపాడుకుందాం - జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త
ఆలేరు, పాలేరు వాగు లను కబ్జా కోరుల నుండి కాపాడుకుందాం - జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త
ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలి ప్రకృతి వైపరిత్యాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త వహించాలి - జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త
భవిష్యత్ లో మరల ప్రణ నష్టములు జరుగకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి - జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త
డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ఆకేరు వాగు అలాగే పాలేరు వాగు ప్రవహిస్తూ ప్రతి సంవత్సరం డోర్నకల్ నియోజక వర్గానికి దుఃఖః దాయనిగా తయారవడం మనము గత రెండు సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాం.
కిందటి ఏడాది పురుషోత్తమాయగూడెం దగ్గర వాగు ఉదృతంగా ప్రవహించి అక్కడే ఉన్న గంగా గుడి యొక్క శిఖరం పైనుంచి ప్రవహించడం, అలాగే బ్రిడ్జి దగ్గర ఉన్న శిలాఫలకం పై నుండి ప్రవహచడం జరిగింది అలాగే ఉగ్గంపల్లి శివారులో ఉన్న గంగమ్మ గుడి ప్రాంగణం ధ్వంసం అవ్వడం జరిగినది అలాగే పాలేరు వాగు పైన ఉన్న బ్రిడ్జి లు, వంతెనలు కొట్టుకు కోవడం వివిధ ప్రదేశాల్లో సృష్టించిన బీభత్సం మన కళ్ళ ముందు నుండి చెరిగిపోక ముందే ఈ ఏడాది వరదలు ఉదృతంగా ప్రవహించడం అందులో ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అమాయక గిరిజన బిడ్డ మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద వరదల్లో కొట్టుకొని వారి తండ్రి తో సహా జల సమాధి అవ్వడం జరిగినది ఇంత జరుగుతున్న కూడా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న ఈ రెండు వాగులకు ఇరువైపులా రైతులు వాగులు కబ్జా చేస్తున్న విషయం ప్రభుత్వాధికారులకు తెలిసినా కూడా వివిధ మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ వారి పైన ఉన్న పై అధికారులు కానీ దీనిపైన ఎలాంటి సూచనలు ఎలాంటి దిశ నిర్దేశం ఇవ్వకపోవడం శోచనీయం.
డోర్నకల్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న ఈ రెండు వాగుల యొక్క అంచుల వెంబడి జెసిబి లు పెట్టి చదును చేసి వ్యవసాయ భూమిగా వాగులను మార్చుకుంటున్న విషయం నిన్న తానంచర్ల శివారు ఉన్న వాగు దగ్గర కనబడినది అని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త యాదవ్ రమేష్ నాయక్ పేర్కొన్నారు
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆపద వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడం కాకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఏరు యొక్క సరి హద్దులను నిశ్చయించి ప్రతి మండలంలో అక్కడ హద్దులు దాటి వచ్చే రైతుల మీద చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.
త్వరిత గతిన కబ్జా కు గురి అవుతున్న అకేరు, పాలేరు వగులను కాపాడాలని జిల్లా యంత్రాంగం కి విన్న విస్తున్నాము అని అలాగే తానం చర్ల వద్ద కోటియ తండా, వాల్య తండా, అజ్మీరా తండా లకు వెళ్ళడానికి తానం చర్ల నుండి వేయలసిన వంతెన పనులు త్వరిత గతిన మొదలు పెట్టాలి అని ప్రజల తరుపున లంబాడీల ఐక్య వేదిక తరుపున కోరుతున్నాము అని జాదవ్ రమేష్ నాయక్ తెలిపారు.
Comments
Post a Comment