అమెరికా కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి

అమెరికా కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి

సికె న్యూస్ 

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కు చెందిన ఓ విద్యార్థి మరణించాడు. వివరాల ప్రకారం..ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట కు చెందిన నూకారపు కోటేశ్వరరావు కు కుమారుడు సాయి తేజ(22) ఉన్నాడు.



గత మూడు నెలల క్రితం పై చదువుల నిమ్మితం తల్లిదండ్రులు అమెరికాకు పంపించారు. సాయి తేజ షాపింగ్ మాల్ లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. 

శనివారం నాడు కొంతమంది ఉగ్రవాదులు షాపింగ్ మాల్ లోకి వచ్చి సాయి తేజ పై కాల్పులు జరిపి షాప్ లో గల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధుమిత్రులు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments