సాయి తేజ కుటుంబానికి ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం...

సాయి తేజ కుటుంబానికి ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం...

అమెరికాలో కాల్పుల్లో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి పట్ల ఎంపీ సంతాపం

సాయి తేజ కుటుంబ సభ్యులకు ఫోన్లో పరామర్శించిన ఎంపీ

ముఖ్యమంత్రికి లేఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో వాకబు చేసిన లోక్ సభ సభ్యులు రఘురాం రెడ్డి 



*ఖమ్మం:* అమెరికాలో తుపాకీ తూటాలకు ఖమ్మం జిల్లా విద్యార్థి బలి అవడం పట్ల  ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఖమ్మం అర్బన్  మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడైన నూకారపు  సాయి తేజ.. భారత కాలమాన ప్రకారం  శనివారం తెల్లవారుజామున దుoడగుల కాల్పుల్లో మృతి చెందిన దుర్ఘటన తెలుసుకొని తీవ్ర సంతాపం ప్రకటించారు. 

నగరంలోని రాపర్తి నగర్ లో నివాసం ఉంటున్న మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్  ద్వారా ఫోన్లో విద్యార్థి తండ్రి నూకారపు కోటేశ్వర రావు తో ఎంపీ మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. 

ఎంఎస్  చదివేందుకు నాలుగు నెలల కిందటే అమెరికా వెళ్లాడని.. ఇప్పుడు ఇంతటి ఘోరం జరిగిందని అతను కన్నీరు మున్నీరవగా.. ధైర్యంగా ఉండాలంటూ ఎంపీ ఓదార్చారు. మృతుడి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments