భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్ట్ బ్యానర్ల కలకలం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
నవంబర్ 30,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేయడం కలకలం రేపింది. చర్ల మండలం పూసుగుప్ప- వద్దిపాడు ప్రధాన రహదారిపై రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి. ఇందులో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు తలపెట్టిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీ ఎల్ జీ ఎ) వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment