కన్సల్టెన్సీ కార్యాలయంలో గిరిజన లా విద్యార్థిని అనుమానాస్పద మృతి



 గిరిజన న్యాయ విద్యార్థి ఓ కన్సల్టెన్సీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో గిరిజన సంఘాలు ఆమె మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో మలక్‌పేట పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు

ఫ్యాన్‌కు విగత జీవిగా వేలాడిన వైనం




మా అమ్మాయిది హత్యే : తల్లిదండ్రులు


మలక్‌పేటలో గిరిజన సంఘాల ఆందోళన

*అగ్రకుల బిడ్డకో న్యాయం గిరిజన బిడ్డకో న్యాయమా?* #justiceshravya

గిరిజన న్యాయ విద్యార్థి ఓ కన్సల్టెన్సీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో గిరిజన సంఘాలు ఆమె మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో మలక్‌పేట పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం తక్రజ్‌గూడ తాండ నివాసి ఇస్లావత్‌ శ్రావ్య (20) ఎల్‌బీనగర్‌లోని శ్రుతి గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటూ మహత్మాగాంధీ లా కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. పార్ట్‌టైమ్‌గా సలీంనగర్‌లోని ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలో పని చేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీ కార్యాలయానికి సెలవు. అయినా కార్యాలయానికి వచ్చిన శ్రావ్య సాయంత్రం అత్యవసరంగా రూ.20 వేలు కావాలని తన సోదరుడైన సాయికిరణ్‌ను ఫోన్‌లో అడిగింది. ఆ వెంటనే సాయి కిరణ్‌ ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేశాడు. అనంతరం కొద్ది సేపటికే శ్రావ్య మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది.





దీంతో సాయికిరణ్‌ తన సోదరి హాస్టల్‌ స్నేహితురాలైన శిరీషకు ఫోన్‌ చేయగా ఆమె మరో స్నేహితురాలైన సోనీ, స్నేహితుడు కార్తీక్‌తో కలిసి శ్రావ్య పనిచేసే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ న్యాయవాది రవీందర్‌తో కలిసి గ్రౌండ్‌ ఫ్లోర్‌ కిటికీల్లో నుంచి చూసేసరికి శ్రావ్య సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్రావ్య ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే ప్రసక్తే లేదని ఆమె తండ్రి ఇస్లావత్‌ రమేష్‌, తల్లి కంసా విలపిస్తూ తెలిపారు. శ్రావ్యది ఆత్మహత్య కాదని, హత్యే అని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కన్సల్టెన్సీ నిర్వాహకుడైన నవీన్‌ను ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని వారు పోలీసులను నిలదీశారు. శ్రావ్య అనుమానాస్పద మృతిపై గిరిజన సంఘాల ప్రతినిధులు, గిరిజన న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ నాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు గిరిజన సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కాగా, శ్రావ్య మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్‌ వెల్లడించారు.




Comments